తెలంగాణ

నియంత కేసీఆర్‌ను తరిమికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, అక్టోబర్ 19: గత 6 సంవత్సరాలుగా రాష్ట్రంలో నియంతపాలన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి కోటా రామారావును గెలిపించాలని కోరుతూ శనివారం రోడ్‌షో నిర్వహించారు. భారీగా వచ్చిన ప్రజలను ఉద్దేశించి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అనేక సంవత్సరాలాగా కాంగ్రెస్,టీఆర్‌ఎస్ పార్టీలను గెలిపిస్తున్నారని ఈ ఉప ఎన్నికలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని మంత్రి కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల గమ్యం ఒకటేనని, రెండుకూడా కుటుంబ పార్టీలని, అవినీతి పార్టీలని ప్రజాధనాన్ని దోపిడీ చేసే పార్టీలని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీలు బొమ్మ, బొరుసు లాంటివని ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరడం ఖాయమని ఆయన అన్నారు. ఉత్తమ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన 15 మంది కేసీఆర్ డబ్బులకు ఆమ్ముడుపోయి టీఆర్‌ఎస్‌లో చేరారని అలాంటి పార్టీ ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణా తల్లి కల్వకుంట్ల కుటుంభం, ఓవైసీ కుటుంభాలకు బందీగా ఉందని ఈ రెండు కుంటుంబాలు కలిసి తెలంగాణాను పాలిస్తున్నారని, శాసిస్తున్నారని తెలంగాణ తల్లిని వారి కబంద హస్తాలనుండి విముక్తి కలిగించే రోజు అసన్నమైందని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందుకుంటున్న కేసీఆర్ ప్రజల సమస్యలపై ఏనాడు దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఎవరైతే తెలంగాణ వద్దనుకున్నారో ఉద్యమాల్లో పాల్గొనని వారిని కేసీ ఆర్ భుజాన వేసుకుని ఊరేగిస్తున్నారని కేసీ ఆర్‌ను దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశంలో ఇప్పటివరకు 11 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్‌లు అందించామని కోట్లాది సంఖ్యలో మరుగుదొడ్లకు నిధులు వెచ్చించామని కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థి కోటా రామారావు మట్లాడుతూ హుజూర్‌నగర్ నియోజకవర్గం మరింత అభవృద్ధి చెందాలంటే ఈ ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి చేసిచూపిస్తానని రామారావు అన్నారు. ఈ రోడ్‌షో కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి, మనోహర్‌రెడ్డి, మల్లేశం, కనూనె సులోచన తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...రోడ్డు షోలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి