తెలంగాణ

కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 3: కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని, ఈ తరహా కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడతామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఇతర జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు రెండు కోట్ల రూపాయలు తన వద్ద నుండి దండుకున్నారంటూ వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తాహెర్ ఖండించారు. జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు కోట్ల రూపాయలను ఎవరికి, ఎప్పుడు ఇచ్చారో, ఆ డబ్బులు ఎలా వచ్చాయో వెంకటరమణారెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో పలు దఫాలుగా జిల్లా పార్టీ నేతలమంతా చర్చించుకుని టి.పిసిసి ద్వారా ఎఐసిసి అధిష్ఠానానికి నివేదిక పంపిన తరువాతే వెంకటరమణారెడ్డికి టిక్కెట్ కేటాయించారని తెలిపారు. ఇదివరకు జడ్పీ చైర్మన్‌గా కొనసాగినందున స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తే, అర్ధాంతరంగా నామినేషన్‌ను ఉపసంహరించుకుని కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. ఒకవేళ వాస్తవంగానే ఎవరైనా ఒత్తిళ్లకు గురి చేసి ఉంటే ఆ విషయమై పార్టీ అధిష్ఠానం పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉండేదని, కనీసం జిల్లా నాయకత్వానికి కూడా నామమాత్రంగానైనా సమాచారం అందించకుండా గుట్టుగా నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం శోచనీయమన్నారు. ఈ వ్యవహారం వెనుక వాస్తవాలు ఏమిటో జిల్లా ప్రజలకు వెంకటరమణారెడ్డి తేటతెల్లం చేయాలన్నారు. వెంకటరమణారెడ్డితో ఆయన బాల్యమిత్రుడైన తెలంగాణ పౌల్ట్ఫ్రీరం యజమానుల సంఘం అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి మధ్యవర్తిగా అధికార పార్టీ నేతలు సంప్రదింపులు జరపడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

రంజిత్‌రెడ్డి ద్వారా వెంకటరమణారెడ్డి నేరుగా ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఫోన్‌లో సంభాషించిన విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని, ఈ మేరకు తాము కూడా ఆధారాలు సేకరిస్తున్నామని తాహెర్ స్పష్టం చేశారు.

ఫొటోరైటప్: 3ఎన్‌జడ్‌బి.జెపిజి: విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్