తెలంగాణ

ఉత్కంఠ, ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలన్న డిమాండ్‌తో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన ప్రగతిభవన్ ముట్టడి సోమవారం ఉద్రిక్తతలు, ఉరుకులు, పరుగులు, ఆరెస్టులతో ఆద్యంతం ఉత్కంఠగా జరిగింది. ప్రగతిభవన్ ముట్టడిని విఫలం చేయడానికి పోలీసులు ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రి నుంచే కాంగ్రెస్ ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ కొందరు నేతలు పోలీసుల కళ్లు గప్పి ప్రగతిభవన్‌కు చేరుకోవడం, మరికొందరిని మార్గమధ్యంలోనే అరెస్టు చేసి వివిధ పోలీస్ ఠాణాలకు తరలించారు. ఆందోళనకారులు రోడ్డు మార్గంలో కాకుండా మెట్రోరైలులో ప్రగతిభవన్‌కు చేరుకునే అవకాశం ఉంటుందన్న అంచనాతో బేగంపేట మెట్రోరైలు స్టేషన్‌ను మధ్యాహ్నం వరకు మూసివేశారు. బేగంపేట స్టేషన్‌లో మెట్రోరైలు ఆగదని ఆకస్మికంగా సైన్ బోర్డులు
ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి తమ గమ్యాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కే జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, జే గీతారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిని తెల్లవారు జామునే గృహ నిర్బంధం చేసి ముట్టడికి వెళ్లకుండా కట్టడి చేయడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు. అలాగే మాజీ ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డిని కూడా గృహ నిర్బంధం చేయడమే కాకుండా ఆయన ఇంటి వద్ద ముళ్లకంచెను ఏర్పాటు చేయడంతో పోలీసుల చర్యపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మార్గం ద్వారా కాకుండా మెట్రోరైలు ద్వారా ప్రగతిభవన్ చేరుకోవడానికి ప్రయత్నించిన మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను అడ్డుకుని అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద కూడా అర్ధరాత్రి నుంచే పోలీసులు నిఘా పెట్టి గృహ నిర్బంధం చేశారు. రేవంత్‌రెడ్డి ఇంట్లో ఆదివారం రాత్రి నుంచే ఇంట్లో లేరని పోలీసులకు సమాచారం లీక్ కావడంతో ప్రగతి భవన్‌కు సమీపంలోని హోటళ్లు, లాడ్జీలు, రేవంత్‌రెడ్డి బంధువుల ఇళ్లకు వెళ్లి పోలీసులు గాలించారు. అయితే తమకు అందిన సమాచారం వాస్తవం కాదని రేవంత్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఆయన ఇంటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి కాపలా కాశారు. అయితే మెరుపు వేగంతో తన ఇంటి నుంచి బయటికి వచ్చిన రేవంత్‌రెడ్డి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని బైక్‌పై ప్రగతిభవన్ వైపు దూసుకుపోయారు. మూడు వాహనాల్లో పోలీసులు వెంబడించినప్పటికీ చిక్కకుండా తప్పించుకున్న రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్ ఎదుటకు చేరుకొని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని కామాటిపురా ఠాణాకు తరలించారు. అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసుల కళ్లుగప్పి ఆటోలో ప్రగతిభవన్ వైపు వెళ్తుండగా సోమాజిగూడ వద్ద ఆయనను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. విద్యానగర్‌లో ఆర్టీసీ జేఏసీ సమావేశానికి హాజరై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తన ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి మలక్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకులు మానవతా రాయ్, విక్రం గౌడ్, ఇందిరా శోభన్ పోలీసుల కళ్లు గప్పి ప్రగతిభవన్‌కు చేరుకోగా అరెస్టు చేసి వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులంతా ఒకేసారి కాకుండా దశల వారీగా చేరుకునే విధంగా వ్యూహం పన్నినప్పటికీ పోలీసులు గట్టి నిఘా పెట్టి విడతల వారీగా అరెస్టులు చేసి ఠాణాలకు తరలించారు. దీంతో ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత, ఉరుకులు, పరుగుల మధ్య కొనసాగగా తమ కార్యక్రమం విజయవంతమైందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో తెలిపారు.

*చిత్రం... కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడితో సికిందరాబాద్ నుంచి భారీగా స్తంభించిన ట్రాఫిక్