తెలంగాణ

రూ. 300 కోట్ల వ్యయంతో టెక్నాలజీ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో టెక్నాలజీ సెంటర్స్‌ను, ఎక్స్‌టెన్షన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్-చైర్మన్ బి. వినోద్‌కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన తన నివాసంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్ట్ఫీషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్, ఎమర్జింగ్ టెక్నాలజీతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, వృత్తినైపుణ్యాన్ని అభివృద్ధి పరిచేందుకు ఈ సెంటర్స్ ఉపయోగపడతాయన్నారు. వరంగల్ నగరంలో టెక్నాలజీ సెంటర్, కరీంనగర్ నగర్ శివారులో ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం త్వరగా స్థలాల సేకరణ పూర్తి చేయాలని ఆ యా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. అలాగే సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కడా ఎక్స్‌టెన్షన్ సెంటర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ పాంతీయ సంచాలకులు రాజశేఖర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం... పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమైన ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ వినోద్ కుమార్