తెలంగాణ

కేసీఆర్‌ను ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం, ఉన్నత న్యాయస్థానం సూచనలను సైతం గౌరవించకపోవడం ప్రజాస్వామ్యంలో నియంతలా మాట్లాడటం, ముఖ్యమంత్రిగా హుందాతనం లేకుండా ప్రగతి భవన్ దాటి బయటకురాకపోవడం చూస్తుంటే కేసీఆర్‌ను ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో చికిత్స అవసరమనిపిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక మానసిక నిపుణులతో చికిత్స చేయించాలని అన్నారు. గురువారం నాడు హైదరాబాద్ మిధాని డిపో వద్ద సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నా శిబిరాన్ని నారాయణ నగర కార్యదర్శి ఈటీ నర్సింహతో కలిసి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె,కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నా కనికరం లేకపోవడం, రకరకాల సమస్యలతో రాష్ట్రం మొత్తం స్తంభించిపోయినా పట్టించుకోకపోవడం నియంతలా ప్రకటనలు చేయడం విచారకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం , హక్కులు ఉంటాయని , ప్రజల ఆకాంక్షలను, ఆశలను, ఆలోచనలను పరిరక్షిస్తూ జవాబుదారీతనంతో హుందాగా వ్యవహరించాలని, నియంతలా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రభుత్వం తాత్సారం చేయకుండా ఆర్టీసీ కార్మిక సంఘాలను వెంటనే చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నారాయణ కోరారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ ప్రజలకు విశ్వాసం లేని ప్రభుత్వం మనుగడలో ఉండదని అన్నారు. అణచివేతకు, అసమానతలకు గురిచేస్తే ప్రజలు తిరగబడతారని, మొంటి పట్టు వీడి న్యాయమైన ఆర్టీసీ కార్మికుల కోర్కెలపై చర్చలు జరిపి వాటిని పరిష్కరించాలని అన్నారు. సీపీఐ సమితి సభ్యురాలు ఎస్ ఛాయాదేవి, జీ చంద్రమోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నీరోచక్రవర్తిలా కేసీఆర్: తమ్మినేని
ముఖ్యమంత్రి కేసీఆర్ నీరోచక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఉద్యమం నుండి వచ్చిన చరిత్ర హీనులుగా మారవద్దని ఆయన హితవు పలికారు. కుటుంబాలతో సహా దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికులను వామపక్ష నేతలు కలిసి మద్దతు తెలిపారు. తమ్మినేని వీరభద్రంతో పాటు కార్యదర్శి వర్గ సభ్యుడు డీజీ నర్సింహరావు, బీ వెంకట్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యుడు బాల మల్లేష్, ఎంఎల్ నేత రమ, సూర్యం తదితరులున్నారు.