తెలంగాణ

రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 21: తెలంగాణలో ప్రజా తిరుగుబాటు ప్రారంభమైందని, టీఆర్‌ఎస్ పతనానికి ఆర్టీసి కార్మికుల సమ్మె నాందిగా నిలుస్తుందని బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. ఆర్టీసి కార్మికుల సమ్మెలో భాగంగా మహబూబ్‌నగర్‌లో సోమవారం ఆర్టీసి కార్మికులు చేపట్టిన ధర్నా శిబిరంలో మాజీ మంత్రి డీకే అరుణ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆమె కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు ప్రారంభమైందని రాష్ట్ర మంత్రులంతా కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగితే తెలివి ఉన్న ముఖ్యమంత్రి అయితే కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సమ్మె చేస్తున్న కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. సెల్ప్ డిస్మిస్ అనేది ఉంటే ముందుగా కేసీఆర్‌కు వర్తిస్తుందని డీకే అరుణ ఆరోపించారు. ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అలా కాకుండా పోలీసులతో రాష్ట్రాన్ని పరిపాలిస్తాననుకోవడం కేసీఆర్ మూర్ఖత్వమని ధ్వజమెత్తారు. త్వరలోనే కేసీఆర్ అవినీతి బయటపడుతుందని దాంతో ఆయనతో పాటు కొంతమంది ఆయన భజనపరులు జైలు జీవితం గడపడం ఖాయమని అన్నారు. అధికారం శాశ్వతం అనుకుని టీఆర్‌ఎస్ నాయకులు విర్రవీగుతున్నారని ఇక తెలంగాణ ప్రజలు కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకుల వ్యవహారాలన్నీ తెలుసుకుని సోయిలోకి వచ్చారన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిదని హితవుపలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు మొదలుపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేవరకు బీజేపీ కార్మికులకు అండగా నిలుస్తుందని అన్నారు. కార్మికుల ఉసురు తగలకముందే కేసీఆర్ మేల్కొని సమస్యను పరిష్కరించాలని, ఇప్పటికే ఇద్దరు కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైనందున వారి ఆత్మలు ముఖ్యమంత్రిని వెంటాడుతున్నాయనే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని అన్నారు. కేసీఆర్‌ను పదవి నుండి దింపితే తెలంగాణ సేఫ్‌గా ఉంటుందని ఆ దిశగా తెలంగాణ ప్రజానీకం అడుగులు వేస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రవారి ముందు తలవంచుకునే పని చేయొద్దంటూ వారు నవ్వుకునే విధంగా ఉండొద్దని గొప్పగొప్పగా ప్రసంగాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు నీ వల్ల ఆంధ్ర నాయకులు నవ్వుకునే విధంగా పరిపాలన ఉందని విమర్శించారు. తాను నియంతనని తననెవరూ ఏమీ చేయలేరు అనేవిధంగా కేసీఆర్ వ్యవహారం ఉందని ఇలాంటి వారిని పదవి నుండి దింపితే అహంకారం దిగిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష నాయకులు రవీందర్‌రెడ్డి, బసప్ప, సాయిరెడ్డి, జెఎల్‌గౌడ్, చిట్టెమ్మ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ధర్నాలో మాట్లాడుతున్న బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ