తెలంగాణ

హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21:ఆర్టీసీ సమ్మె 17రోజుకు చేరుకున్న సందర్భంగా జేఏసీతో కలసి కాంగ్రెస్, వామపక్షాలు నేతలు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద వంటావార్పులో సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు, సీపీఐ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్ డిపోల వద్ద కార్మిక కుటుంబాలతో బైఠాయింపు కార్యక్రమం చేశారు. ఈ బైఠాయింపులో డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణ చౌరస్తాల్లో నిరసనలతో హోరెత్తింది. సోమవారం సమ్మెకు కాంగ్రెస్ మద్దతు తెలపడంతో జిల్లాల్లో సమ్మెకు మరింత ఊపువచ్చింది. రాస్తారోకోలు ధర్నాలు, ఊరేగింపులతో కార్మికుల్లో ఉత్సాహం పరుగులెత్తించింది. దీంతో నిరసనల జోరు రెట్టింపు అయ్యింది. జేఏసీ ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సమ్మె నిరసనలు వినూత్నంగా మారాయి.

*చిత్రం...వంటావార్పులో పాల్గొన్న కాంగ్రెస్, సీపీఐ , జేఏసీ నేతలు