తెలంగాణ

పరిశోధనా ఫలితాలు రైతులకు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనా ఫలితాలు ఎప్పటికప్పుడు రైతులకు చేరాలని, ఈ పరిశోధనా ఫలితాల వల్ల పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన ‘యూత్ యాజ్ టార్చ్ బేరర్స్ ఆఫ్ బిజినెస్ ఓరియెంటెడ్ అగ్రికల్చర్ ఇన్ సౌత్ ఇండియా’ ప్రాంతీయ సదస్సును ఆమె ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో దక్షిణ భారత దేశానికి చెందిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్-్ఛన్సలర్లు, ఐసిఏఆర్ సంస్థల డైరెక్టర్లు, శాస్తవ్రేత్తలు, వ్యవసాయ అధికారులు, బ్యాంకుల అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ పట్ట్భద్రులు పాల్గొంటున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార పంటల ఉత్పత్తులు పెరగాల్సి ఉందని, ఇందుకు వ్యవసాయ రంగంలో పరిశోధనలు దోహదపడాలని గవర్నర్ అన్నారు. అందరికీ అన్నం పేట్టే రైతే ప్రపంచానికి జాతిపిత అంటూ మహాత్మాగాంధీ పేర్కొన్నారని గవర్నర్ గుర్తు చేశారు.
రైతుల ఆదాయం పెరిగేందుకు, వ్యవసాయ రంగం సంక్షేమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక చర్యలు తీసుకున్నారని తమిళిసై గుర్తు చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు ఆర్థిక సాయం అందించడం, పింఛన్ సౌకర్యం కల్పించడం తదితర పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిందని గవర్నర్ తెలిపారు. వ్యవసాయం వైపు యువతను ఆకర్షించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఈ సదస్సు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు దూసుకువెళుతోందని కితాబిచ్చారు. స్వయంగా రైతు అయిన నిరంజన్‌రెడ్డి వ్యవసాయ మంత్రిగా ఉండటం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. మామిడితోటల పెంపకం చేపట్టిన నిరంజన్‌రెడ్డి, మామిడిపళ్లను విదేశాలకు కూడా ఎగుమతి చేయడం, రైతులకు ఆదర్శంగా నిలవడమేనని అన్నారు. త్వరలోనే తాను మంత్రి మామిడితోటను సందర్శిస్తానని, జోగులాంబ దేవాలయాన్ని సందర్శిస్తానని తెలిపారు. వ్యవసాయ యూనివర్సిటీ వైస్-్ఛన్సలర్ ప్రవీణ్‌రావువ్యవసాయ రంగ అభివృద్ధికి మంచి కృషి చేస్తున్నారని గవర్నర్ కితాబిచ్చారు. వచ్చే నెలలో గవర్నర్‌ల సదస్సు జరుగుతోందని, దాంట్లో వ్యవసాయ రంగం అభివృద్ధిలో ముందుకు వెళుతున్న తెలగాణ గురించి తెలంగాణ గవర్నర్‌గా తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు.
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయంలో కొత్త పరిజ్ఞానం, మార్కెటింగ్ సదుపాయాల గురించి గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పోస్ట్-హార్వెస్టింగ్, ఫుడ్‌ప్రాసెసింగ్ విధానాల గురించి యువ రైతులకు తెలియచేయాల్సి ఉందన్నారు. ఆదర్శరైతుల విజయగాథలను అందరికీ మోడల్‌గా చూపాల్సిన అవసరం ఉందన్నారు. యువతను సేద్యం వైపు మళ్లించేందుకు వ్యవసాయంతో పాటు పాడి, పశువుల పెంపకం, తేనెటీగల పెంపకం తదితర పనులు చేపట్టేందుకు ప్రోత్సహించాలన్నారు.
వ్యవసాయం వైపు యువతను ఆకర్షించడం పెద్దసవాల్ అని ‘ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సైనె్సస్’ చైర్మన్ డాక్టర్ ఆర్‌ఎస్ పరోడా పేర్కొన్నారు. దేశంలో యువశక్తిని వ్యవసాయంవైపు మళ్లించడం వల్ల భవిష్యత్తులో ఆహార పదార్థాల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ఫండ్’ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆధునిక విజ్ఞానం వ్యవసాయ అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన స్వల్ప వ్యవధిలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థితిగతులపై సమీక్షించడం శుభపరిణామమని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ వి. ప్రవీణ్‌రావు తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వ్యవసాయ రంగం మారాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో వ్యవసాయ రంగం పరోభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
*చిత్రం...జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభిస్తున్న గవర్నర్ తమిళిసై