తెలంగాణ

చర్చలకు సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ మినహాయించి మిగతా 21 డిమాండ్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ, ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బీ వినోద్‌కుమార్, ప్రభుత్వ శాంతి భద్రతల సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల సాధ్యాసాధ్యాలపై సీఎం చర్చించారు. సమ్మెపై ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పత్రాలు అధికారికంగా మంగళవారం చేరాయి. ఈ ఆదేశాలపై న్యాయ నిపుణులు, ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో కలిసి మంత్రి అజయ్‌కుమార్ అధ్యయనం చేశారు. అనంతరం వారు అధికారిక పత్రాల్లోని సారాంశాన్ని ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంకు వివరించారు. ఈ నెల 28న ఆర్టీసీ
సమ్మెపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను వదులుకున్నట్టు కార్మిక సంఘాలు హైకోర్టుకు స్పష్టం చేయడంతో ఇతర డిమాండ్లను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. అయితే, ఈ డిమాండ్లను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆరుగురు ఈడీలతో ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ కమిటీని నియమించారు. ఈడీల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని సీఎం సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాలు మొదట ప్రకటించారని పేర్కొన్నారు. కానీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి పట్టుబట్టబోమని కార్మిక సంఘాలు చెప్పాయని పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక్కటే తమ డిమాండ్ కాదని కార్మికుల తరఫున హైకోర్టులో వారి న్యాయవాది చెప్పారని పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారని పేర్కొన్నారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్‌ను వదులుకున్నట్టు అయిందన్నారు. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని హైకోర్టు సూచించినట్టు పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ డిమాండ్లను పరిశీలించాలని, అధ్యయనం చేయాలని ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. ఈడీల కమిటీ ఒకటి రెండు రోజుల్లో తన నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్బలంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు ఇవ్వడం అనైతికమని సీఎం తప్పుబట్టారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అని సీఎం ప్రశ్నించారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేట్‌పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని సీఎం గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలనే తెలంగాణలో బీజేపీ నేతలు తప్పుబట్టడం విచిత్రమని ముఖ్యమంత్రి అన్నారు.

*చిత్రం... సీఎం కేసీఆర్