తెలంగాణ

విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణలోని పాఠశాలల్లో మూడో తరగతి స్థాయి నుండే పఠన నైపుణ్యాలు, గణిత నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ కొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఈ వ్యూహాన్ని అమలుచేసే క్రమంలో సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
విద్యార్థుల అభ్యాసన ఫలితాలను మెరుగుపరిచేందుకు భారతీయ విద్యా విధానంలో మార్పులకు కృషి చేస్తున్న లాభాపేక్ష లేని సంస్థ సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్‌తో ఈ లక్ష్యాలను సాధించాలని యోచిస్తున్నట్టు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్ విద్యాకార్యక్రమం, సహ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్ చెప్పారు.
ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్ 15 ఏళ్ల పాటు తెలంగాణలోని వివిధ శాఖలతో కలిసి పనిచేశారని, ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ సంస్థను నిర్వహిస్తున్నారని అన్నారు. తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బీ జనార్ధనరెడ్డి మంగళవారం నాడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ విజయకుమార్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనార్ధనరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం తప్పులు వెతకడానికి కాదని, విద్యావిధానాన్ని సమూలంగా పరీక్షించి అభ్యసన ఫలితాల సాధనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. కనుక వారి వారి జిల్లా స్థాయిలో ఈ సంస్థకు సహకరించాలని అన్నారు.
ఈ సందర్భంగా సెంటర్ స్క్వేర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రం దౌలత్‌సింగ్ మాట్లాడుతూ పిల్లల పఠనావగాహన శక్తిని, ప్రాధమిక గణిత భావాలను , నిత్యజీవితంలో ఉపయోగించుకోవడం అనేది మూడో తరగతిలోపు సాధించాల్సిన ముఖ్య లక్ష్యంగా గుర్తించడం ముదావహమని అన్నారు.
కాగా పాఠశాల విద్య అదనపు సంచాలకుడు -సమన్వయం విభాగానికి సీహెచ్ రమణకుమార్‌ను నియమించారు. ఇంకో పక్క ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ షెడ్యూలును ప్రకటించింది.
క్యూఎస్ వరల్డ్ రేటింగ్‌లో సెంట్రల్ వర్సిటీ
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ మరో ఖ్యాతిని గడించింది. క్యూఎస్ వరల్డ్ రేటింగ్‌లో వర్శిటీ దేశంలోనే టాప్ 10 వర్శిటీల్లో చోటు సంపాదించుకుంది.ఈ ఘనత సాధించడం వరుసగా ఇది రెండోసారని వీసీ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు పేర్కొన్నారు. ఐఐటీ ముంబై, ఐఐఎస్సీ బెంగలూరు, ఐఐటీ ఢిల్లీ స్థానాలను సంపాదించుకోగా, హెచ్‌సీయూకు ఎనిమిదో స్థానం దక్కింది.