తెలంగాణ

ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత అందరిదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 22: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం గత 18 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈనెల 30న హైదరాబాద్‌లో జరిగే పోలికేక బహిరంగ సభతో సీఏం కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిస్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాష్ట్ర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర మంగళవారం నాగర్‌కర్నూల్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులతో కలిసి స్థానిక బస్‌డిపో నుంచి గాంధీపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీపార్కు వద్ద ఆర్టీసీ కార్మికులనుద్దేశించి తమ్మినేని మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎర్ర జెండా పార్టీలు నిరంతరం పోరాటం చేస్తాయని, గతంలో అనేక పోరాటాలతో ప్రభుత్వాలను కదిలించి హక్కులు, సంక్షేమం తదితర వాటిని సాధించామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ప్రజాబలం ఉందని, ఇందుకు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర బంద్ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడమే నిదర్శనమన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం ముఖ్యంగా ఆర్టీసీని రక్షించుకునేందుకు, ఉద్యోగ భద్రత కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు, సంఘాలు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారని అన్నారు. చర్చలు జరిపి సమ్మెను విరమింపచేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా కుంటి సాకులు చెబుతూ దాటవేస్తూ ఓ నియంతలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టించేలా ఈనెల 30న హైదరాబాద్‌లో పోలికేక బహిరంగసభను నిర్వహిస్తున్నామని, ఇందుకు లక్షలాదిగా ప్రజలు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని రక్షించుకునేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు అందిస్తున్న సహాయసహకారాల గురించి వివరించారు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాలలో ప్రజా రవాణా గురించి వివరించారు. రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాలలో ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని, ఆర్టీసీకి బకాయిగా ఉన్న నిధులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వెంటనే బకాయి నిధులను విడుదల చేయాలని, ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లలో ఉన్న 26 అంశాలలో ఏడు తప్ప మిగతా అన్ని డిమాండ్లు ఆర్టీసీని రక్షించుకునేందుకే అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఆర్టీసీని రక్షించుకునేందుకు ఎర్ర జెండా త్యాగానికైనా సిద్ధమని చెప్పేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలమల్లేష్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్ల్లీ, న్యూ డెమెక్రసీ నాయకురాలు ఎస్‌ఎల్ పద్మతోపాటు వామపక్షాల నాయకులు బాల్‌నర్సింహ్మ, ఆనంద్‌జీ, పర్వతాలు, ఆర్.శ్రీనివాసులు, కందికొండగీత, కొమ్ము భరత్ పాల్గొన్నారు.
*చిత్రం... ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, బాలమల్లేష్, రమ ప్రభృతులు