తెలంగాణ

హైకోర్టే తేల్చాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: రాష్ట్ర హైకోర్టు ద్వారానే ఆర్టీసీ సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం అన్ని మార్గాలను అనే్వషిస్తోంది. హైకోర్టే ఏదో ఒకటి తేల్చాలనే ఆలోచనలో ఉంది. మరోపక్క ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు ఉండవని పరోక్షంగా ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. కాగా, ఈనెల 28 హైకోర్టుకు ప్రభుత్వం అందజేయనున్న నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు ఎలాంటి ప్రతిపాదనలతో నివేదిక ఇస్తారోనని జేఏసీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నివేదిక ఎలావున్నా, తమ డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అటు కోర్టు, ఇటు ప్రభుత్వం నివేదిక ఆర్టీసీ సమ్మెను ఎలాంటి మలుపు తిప్పుతుందోనన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీ యాజమాన్యం నిమించిన కమిటీ మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న విధానాలను కొనసాగిస్తే సంస్థను రక్షించలేమని కమిటీ అభిప్రాయపడుతోంది. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని కమిటీ హైకోర్టుకు నివేదిక ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఆర్టీసీ జేఏసీ నేతలు సూచిస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటే, ప్రభుత్వంపై కోట్లాది రూపాయలు భారం పడుతుందని కమిటీ తెల్చింది. ఆర్టీసీని రక్షిస్తూ, కార్మికుల భవిష్యత్తును పరిరక్షించాలంటే కోర్టే మధ్యేమార్గాన్ని చూపించాల్సి ఉంటుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. జేఏసీ నేతలు డిమాండు చేస్తున్న 26 అంశాలతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం
చేసే విషయాన్ని కూడా కమిటీ సమీక్షించింది. ఆర్థిక పరమైన అంశాలపై ప్రధానంగా కమిటీ దృష్టి పెట్టింది. ఆర్థికేతర అంశాలపై సానుకూలంగా స్పందించింది. కోర్టుకు ఇచ్చే నివేదిక ఫలప్రదంగా ఉండాలని కమిటీ భావిస్తున్నది. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఉన్న నేపథ్యంలో జేఏసీ నేతల అన్ని డిమాండ్లను పరిష్కరించడానికి వీల్లేదని కమిటీ స్పష్టం చేసింది. ఇలావుంటే, సమ్మెకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి గల సాధ్యాసాధ్యాలపై ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు బుధవారం బస్ భవన్‌లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమ్మె, దాని పర్యవసానాలపై దాదాపు 8 గంటల పాటు సమీక్షించారు. గత కొనే్నళ్లుగా పని చేసిన సీనియర్ అధికారులైన ఈడీల ఆధ్వర్యంలో కమిటీ ఆర్టీసీ లాభనష్టాలపై కసరత్తు చేపట్టింది. ఈనెల 28న హైకోర్టుకు సమర్పించే నివేదికే తుది నిర్ణయంగా కనిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్టు తెల్సింది. ఈడీల బృదం నేతృత్వంలో జరిగిన సమీక్షలో సమ్మె విరమించడానికి అవసరమైన ఏఏ అంశాలు చర్చించారో సీఎం ఆరా తీశారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆర్టీసీ సమ్మె కొనసాగడానికి వీల్లేదన్న పట్టుదలతో ఉన్న సర్కారు అందుకు అవసరమైన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ నేతలు మరోసారి కోర్టుకు వెళ్లకుండా అన్ని అంశాలపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నది. సమ్మెకు ముందు, ఆతర్వాత జరిగిన పరిణామాలపై కూడా ఒక నివేదికను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పిస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ ఆస్థుల వివరాలను సైతం కోర్టు ముందు కమిటీ ఉంచుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీకి వచ్చిన ఆదాయాన్ని గణాంకాలతో సహా కోర్టుకు కమిటీ నివేదించనున్నది. గత సంవత్సరం దసరా సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీకి వచ్చిన ఆదాయాన్ని ఈ ఏడాది కోల్పోయామని కోర్టుకు కమిటీ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ లాభనష్టాలపై అధ్యయనానికి దేశంలోని 8-9 రాష్ట్రాల్లో అధికారుల బృదం పర్యటించింది. ఆర్టీసీపై ఇతర రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసిన నివేదికను సైతం కోర్టుకు సమర్పించనున్నది. ఆర్టీసీ నష్టాల నుంచి లాభాలవైపు నడపడానికి తీసుకోవాల్సిన చర్యలు అధ్యయన నివేదికలో ఉన్నట్లు తెల్సింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి ఇప్పటికే 19రోజులు గడిచింది. ఈనెల 28న హైకోర్టులో వాదనలు ఉన్నాయి. అంటే మరో 5 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తున్నది.