తెలంగాణ

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దేశంలో మరే రాష్ట్రం కల్పించని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. జర్నలిస్టు సంఘాల నాయకులు క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. అక్రిడిటేషన్ల జారీ, హెల్త్‌కార్డుల జారీ, నివాస గృహాలు తదితర అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు అపరిష్కృతంగా ఉన్నాయని జర్నలిస్టు సంఘాల నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అధికారుల అలసత్వం కారణంగా అమలుకు నోచుకోవడం లేదని వారు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ తక్షణమే వాటిని పరిష్కరించాలని సమాచార కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, ఎలాంటి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.