తెలంగాణ

ప్రగతి భవన్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఏబీవీపీ బుధవారం చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది. అరెస్టులకు దారితీసింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని వారు కోరారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ముళ్లకంచెలు దాటి లోపలికివెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి పగిడిపల్లి
శ్రీహరి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు 19 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండివైఖరిని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సమ్మెను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, సీఎం నియంతృత్వ పోకడలకు పోవడం సరికాదని అన్నారు. కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా హాస్టళ్లలోకి వచ్చిమరీ విద్యార్థి నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టు సర్కారు చెప్పడం దారుణమని, ఇటువంటి ప్రకటనల వల్లనే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. కార్మికులతో చర్చలు జరపాలని సర్వోన్నత న్యాయస్థానం సైతం సూచించించిన విషయాన్ని గుర్తుచేశారు. మరో పక్క విద్యాసంస్థలు పున:ప్రారంభం అయ్యాయని, సమ్మె కారణంగా సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమ్మె విరమణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరితో పాటు చింత ఎల్లస్వామి, శ్రీశైలం, వీరమల్ల, రమేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ముట్టడి సందర్భంగా ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మరో పక్క ఓయూ జాక్ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు ఉస్మానియా యూనివర్శిటీలో అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.