తెలంగాణ

మార్క్‌ఫెడ్‌కు వేరుశెనగ సేకరణ బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: రాష్ట్రంలో 2019 ఖరీఫ్ సీజన్‌లో ఉత్పత్తి అయ్యే పల్లి (వేరుసెనగ) పంట సేకరణ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు.
ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రైతులకు మేలు చేసేందుకు మద్దతు ధర ఇస్తామని, పల్లీ సేకరణ సందర్భంగా ఈ ఉత్పత్తిపై గతంలో వసూలు చేసిన మార్కెట్ ఫీజును మినహాయించామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం విధించే ఇతర పన్నులను మినహాయించామని తెలిపారు. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందని, రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చే పల్లికి మంచిధర లభిస్తుందన్నారు. సెంట్రల్ నోడల్ ఏజెన్సీ తరఫున టీఎస్ మార్క్‌ఫెడ్ పల్లీ సేకరిస్తుందని వివరించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్థసారథి ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల్లో భాగంగా పల్లీసేకరణ బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించామని వివరించారు.