తెలంగాణ

ధాన్యం శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: రాష్ట్రంలో 2019 ఖరీఫ్ సీజన్‌లో పండిన పంటల ఉత్పత్తులు, మరీముఖ్యంగా ధాన్యం కొనుగోలు ప్రారంభం నుండి పూర్తయ్యే సమయం వరకు మార్కెటింగ్ శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఖరీఫ్ కొనుగోళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై బుధవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, తప్పని సరి పరిస్థితి ఉంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని సెలవులు వాడుకోవచ్చన్నారు. పంటల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం సేకరణకు సంబంధించి శుద్ధిచేసే యంత్రాలను సిద్ధంగా,కండిషన్‌లో ఉంచుకోవాలి, తేమ తనిఖీ యంత్రాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. ధాన్యం సేకరణ సమయంలో అవసరమైతే రక్షణ కోసం అవసరమైన టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి కొనుగోలు ఏ సమయం నుండి ఏ సమయం మధ్య ఉంటుందో రైతులకు కనిపించేలా రాయాలని మంత్రి సూచించారు. పత్తి తేమశాతం ప్రకారం ధరల వివరాలను ప్రదర్శించాలన్నారు. ధాన్యం మిల్లుల వద్ద రైతులకు చెల్లించే ధరల వివరాలను వేబ్రిడ్జి ధరలను, హమాలీ కూలీల చార్జీలను తెలియచేసే విధంగా బ్యానర్లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మార్కెట్లలో కనీస వసతులు ఉండేలా చూడాలని సూచించారు. కార్మికుల సమస్యలు ఏవైనా ఉంటే ముందే పరిష్కరంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...మార్కెటింగ్ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి