తెలంగాణ

జాతీయ ఆదాయం, అభివృద్ధిలో గనుల రంగం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: దేశ అభివృద్ది, జాతీయ ఆదాయంలో గనుల రంగం కీలక భూమిక పోషిస్తుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అభివృద్ది ఏదైనా అందులో గనుల పాత్రనే ముఖ్యమన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, తెలంగాణ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్‌లో విశే్వశ్వరయ్య భవన్‌లో ‘మైనింగ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్-ఇనె్వస్ట్‌మెంట్ ఇష్యూస్ అండ్ చాలెంజెస్’ సదస్సును స్పీకర్ ప్రారంభించి ప్రసంగించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 నుంచి 2013 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇసుకపై వచ్చిన ఆదాయం రూ.13.66 కోట్లు కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు రూ.2,383 కోట్లన్నారు.
అలాగే 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రంలో గనుల ఆదాయం పది సంవత్సరాలలో రూ. 12 వేల కోట్లు కాగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఐదు సంవత్సరాలలోనే ఇది రూ. 16 వేల కోట్లకు చేరిందని స్పీకర్ వివరించారు. గనుల రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్బుతమైన ఫలితాలు సాధించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను 1999లో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గనుల వెలికితీత ఆదాయం ఏడాదికి కేవలం రూ. 160 కోట్లు మాత్రమే కాగా ప్రస్తుతం అది ఏడాదికి రూ. 450 కోట్లకు చేరుకుందని స్పీకర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సదస్సు నిర్వహకులు డాక్టర్ టీఎం గుణరాజా, డాక్టర్ జి రామేశ్వరరావు, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ బీఆర్‌విఎస్ సుశీల్‌కుమార్ పాల్గొన్నారు.

*చిత్రం... ఖైరతాబాద్ విశే్వశ్వరయ్య భవన్‌లో ‘మైనింగ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్-ఇనె్వస్ట్‌మెంట్ ఇష్యూస్ అండ్
చాలెంజెస్’ సదస్సును ప్రారంభించి, ప్రసంగిస్తున్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి