తెలంగాణ

విలీనమే ప్రధాన డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23; ప్రభుత్వం ఎలాంటి కమిటీలు వేసినా జేఏసీ డిమాండ్ మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని జేఏసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా బుధవారం హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు, ధూంధాం కార్యక్రమాన్ని చేపట్టారు. జేఏసీ ప్రతిపాధించిన 26 డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రంలో ధనం ఏమైయ్యిందని ఆయన ఎద్దేవ చేశారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేసిన అంశాన్ని కేసీఆర్ ఎందకు విస్మరిస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కంటి తుడుపు కమిటీలతో ప్రయోజనం ఉండదన్నారు. కార్మికులు కాదు చివరికి ఆర్టీసీ డీఎంలు సైతం పని వత్తిడికితో స్పృహ కోల్పోతున్నారని ఆయన గుర్తు చేశారు. బుధవారం నాటికి సమ్మె 19 రోజులకు చేరిందన్నారు. విలీనంపై జేఏసీ వెనక్కి తగ్గిందని ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు. కార్మికులను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం విషప్రచారం చేయడం తగదన్నారు. సమ్మెను మరింత బలోపేతం చేయడానికి బుధవారం రాజకీయ పక్షాలు మద్దతు పలకడంతో ధూంధాం విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమానికి వేలాది కార్మికలోకం కదలివచ్చింది.
*చిత్రం...హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టాండ్ వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు, హాజరైన కార్మికులు