తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ సీజన్‌లో భారీగా వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, అక్టోబర్ 24: శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ జూరాల ప్రాజెక్టు, సుంకేసుల డ్యాం నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో గురువారం సాయంత్రం ఆరుగంటల సమయానికి ప్రాజెక్టు 10 గేట్లను 24 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం ఉదయం ఏడు గేట్లతో మొదలైన నీటి విడుదల మధ్యాహ్న సమయానికి 10 గేట్లను 15 అడుగులు, ఆ తరువాత 24 అడుగులకు పెంచి నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆరుగంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి వరద గేట్ల ద్వారా 5,05,336 క్యూసెక్కులు, సుంకేసుల డ్యాం ద్వారా లక్షా 58,136 క్యూసెక్కులు, హంద్రీనది నుంచి 11వేల క్యూసెక్కులు మొత్తం 6,63,472 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంకు వస్తున్నది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలు నిర్వీరామంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఏడు జనరేటర్లు ఒక్కొక్కటి 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 26,062 క్యూసెక్కులు, భూగర్భ విద్యుత్ కేంద్రం ద్వారా ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కులు, శ్రీశైలం డ్యాం వరద గేట్లను 10 గేట్లనుర 24 అడుగులమేర ఎత్తి 5,47,630 క్యూసెక్కులు మొత్తం 6,16,070 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. గత 24 గంటలలో కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 13.026మిలియన్ యూనిట్లు, భూగర్భ విద్యుత్ కేంద్రం ద్వారా 19.395 మిలియన్ యూనిట్లు మొత్తం 32.421 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ గ్రిడ్‌కు అందిస్తున్నారు. గురువారం సాయంత్రం ఆరుగంటల సమయానికి శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను 884.20 అడుగులు, రిజర్వాయర్ గరిష్ట నీటి నిలువ 215.8 టీఎంసీలకు 210.9946 టీఎంసీలుగా నిలువ ఉన్నది. ఈ సంవత్సరం వరుసగా వస్తున్న వరదనీటితో ఏడోసారి వచ్చిన వరదనీరు భారీగా ఉంది. ఇంకా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
*చిత్రం...శ్రీశైలం జలాశయం 10 గేట్ల ద్వారా కిందకు పారుతున్న వరదనీరు