తెలంగాణ

లబ్ధిదారుల ఎంపికే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపికే అత్యంత కీలకమని, కేటాయింపులో పారదర్శక విధానాలను అమలు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రభుత్వాధికారులను ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చురుకుగా కొనసాగుతోందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రధానంగా లక్ష ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులు చాలా చోట్ల 70 శాతానికి పైగా పూర్తయ్యాయని, మిగిలిన చోట్ల పనులు చురుకుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలియచేశారు. నిర్మాణాలు దాదాపు పూర్తయ్యేందుకు వచ్చిన ప్రాజెక్టు సైట్లప నులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ఆయా ప్రాంతాలకు అవసరమైన తాగునీరు, ఇతర కామ న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులను వెంటనే ప్రారంభించాలని కేటీఆర్ అధికారులను కోరారు. హైదరాబాద్ నగరంలో మురికివాడల ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి ఇప్పటికే ఆ ప్రాంతాల కోసం స్థలాలు ఇచ్చిన పేదలకు అప్పగించాలన్నారు. రాష్ట్రంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన లబ్థిదారుల ఎంపికలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల మేరకు ఒక నిర్దిష్టమైన ప్రక్రియను వెంటనే తయారు చేయాలని హౌసింగ్ శాఖ అధికారులు, కలెక్టర్లను ఆదేశించారు. నిజమైన
పేదవారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎంపిక ప్రక్రియ రూపొందించిన తర్వాత లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో అందరి ముందు ఎంపిక చేయాలని సూచించారు. ఒక్కోసారి ఒక్క లబ్థిదారుడు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పొందిన తర్వాత, ఇంకో చోట దరఖాస్తు చేయకుండా చూసుకోవాలని కోరారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. నాలుగు జిల్లాల పరిధిలో ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు క్షేత్ర స్థాయిలో హౌసింగ్ అదికారులు పర్యటించాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ శాఖమంత్రి ప్రశాంత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

*చిత్రం...డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్