తెలంగాణ

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 31: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్నంతా కొనుగోలు చేసేలా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని సీతారామ ఫంక్షన్‌హాల్‌లో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్ష జరిపి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అమ్ముకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 1.50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి 31 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఎగుమతి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎస్సారెస్పీ రెండోదశ కాలువల్లో నియోజకవర్గంలోప్రస్తుతం ప్రవహిస్తున్నవి నూటికి నూరుశాతం కాళేశ్వరం జలాలేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు కాదంటూ కొందరు ప్రచారం చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం నుంచి కాకుండా ఎస్సారెస్పీ ద్వారా అయితే ఇంకా వెయ్యి రోజులైనా పెన్‌పహడ్, మోతె, నడిగూడెం మండలాలకు నీరు వచ్చేది కాదన్నారు. ఎస్సారెస్పీ ద్వారా వరంగల్‌కే నీరు సక్రమంగా రావడం లేదని ఇంకా సూర్యాపేటకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా తొలి ఫలితం పొందుతున్నది సూర్యాపేట జిల్లా రైతులేనన్నారు. సమెక్య పాలకులు కేవలం కాంట్రాక్టుల కోసమే ఎస్సారెస్పీ కాలువలు తవ్వారని ఆరోపించారు. సీఎం కృషి ఫలితంగా జిల్లాకు కాళేశ్వరం జలాలు చేరినందున వచ్చే సీజన్ నుండి ఒక్క ఎకరం కూడా బీడుగా ఉండకుండా సాగులోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, జేసీ సంజీవరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కోఆర్డ్డినేటర్ ఎస్‌ఎ రజాక్, జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతర్మయి, డీఆర్‌డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...అవగాహన సదస్సులో మాట్లాడుతున్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి