తెలంగాణ

రియల్టీకి రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ప్రోత్సాహానికి ప్రస్తుత కఠిన నిబంధనలను సరళీకృతం చేయడంతోపాటు, బిల్డర్లకు అనేక రాయితీలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరాలు, పట్టణాభివృద్థి సంస్థల పరిధిలో భవన నిర్మాణాల నిబంధనలను సరళీకృతం చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను సిఎం కె చంద్రశేఖర్‌రావు సోమవారం ఆమోదించారు. రియల్టీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని సర్కారు భావిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఉద్దేశించిన ఎల్‌ఐజి ప్లాట్ల క్రమబద్ధీకరణ ఐచ్చికం చేసింది. ఆకాశ హార్మ్య నిర్మాణాల ప్రోత్సాహానికి వీటిపై వసూలు చేస్తున్న ఫీజులను గణనీయంగా తగ్గించింది. ఇకనుంచి రెండు హెకార్లు (ఐదు ఎకరాలు) మించివున్న వెంచర్లకు మాత్రమే షెల్టర్ ఫీజు వసూలు చేస్తారు. జిహెచ్‌ఎంసి పరిధిలో నిర్మించే నిర్మాణాలకు ప్రస్తుతం నాలుగు విడతల్లో వసూలు చేస్తున్న ఫీజును ఇకనుంచి ఒకటి రెండు విడతల్లోనే వసూలు చేయాలని నిర్ణయించింది. 17 అంతస్తులకు లోపు కలిగిన భవనాలకు ఒక స్లాబ్, ఆపై అంతస్తులు కలిగిన భవనాలకు రెండు స్లాబ్‌ల్లో ఫీజు వసూలు చేస్తారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 17 అంతస్తుల వరకు చదరపు మీటరుకు రూ.500 ఫీజు, 17 అంతస్తులు దాటితే రూ.1500 ఫీజు వసూలు చేస్తారు. హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో అయితే 17 అంతస్తుల వరకు చదరపు మీటరుకు రూ.175 వరకు, ఆపై అంతస్తులు దాటితే రూ.500 వరకు రెండో స్లాబ్‌గా నిర్ణయించింది. వీటిలో మార్పులు చేయడం వల్ల ఆకాశ హార్మ్య నిర్మాణాలకు బిల్డర్లు ముందుకొస్తారని ప్రభుత్వం భావిస్తుంది. సైబరాబాద్ డెవలప్‌మెంట్ పరిధిలో వ్యాట్ ఇకనుంచి వసూలు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించింది. జిహెచ్‌ఎంసి పరిధిలోకిరాని ప్రాంతాలకు మాత్రం ఇది వర్తిస్తుంది. ఇకనుంచి భవనాల నిర్మాణాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. భవనాలలో ఉమ్మడి సదుపాయాల కోసం 3 శాతం కేటాయించాల్సిన నిబంధనను కొనసాగిస్తూనే గరిష్టంగా 50 వేల అడుగులకు పరిమితం చేసింది. భవన నిర్మాణం కోసం ఇచ్చే అనుమతి ఇక ఆరేళ్లపాటు చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. తాజా సడలింపు గతంలో అనుమతి పొందిన వారికి కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ పత్రాన్ని 15 రోజుల్లో జారీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆపై జరిగే జాప్యానికి సంబంధిత ఉద్యోగికి రోజుకు రూ.500 జరిమాన విధించనున్నట్టు పేర్కొన్నారు. ఇదివరకు ఖాళీ స్థలాలకు వేసే పన్నును రద్దు చేసింది. గేటెడ్ కమ్యూనిటీస్‌లో రోడ్లు, పాదచారుల రహదారులవంటి ఉమ్మడి వినియోగాల కోసం 10 శాతం స్థలాన్ని చూపించాలనే నిబంధన మినహాయించినప్పటికీ, వీటిని దుర్వినియోగం జరగకుండా వాటిపై అధికారాన్ని స్థానిక సంస్థలకు బదలాయించాలని నిర్ణయించింది. గేటెట్ కమ్యూనిటీ భవనాలకు గతంలో ఉన్న సెట్‌బ్యాక్ నిబంధనలను, అదనపు ఫ్లోర్లపై ఉన్న నిబంధనలను సడలించింది. అవుటర్ రింగ్ రోడ్లకు అనుకొని ఉన్న గ్రోత్ కారిడార్లకు ప్రత్యేక ప్రభావిత రుసుం 50శాతానికి తగ్గించింది. మల్టిఫ్లెక్స్‌ల్లో అదనపు అంతస్తుల నిర్మాణాలు విమానయాన శాఖ, అగ్నిమాపక శాఖ అనుమతులకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో 50 అడుగుల దూరంలో మాత్రమే నిర్మాణాలకు అనుమతిస్తారు. అలాగే 200 అడుగుల స్థలంలో నిర్మించే భవనాలకు సిల్ట్ ఫ్లోర్స్‌కు ఇకనుంచి అనుమతిస్తారు. వీటివల్ల రోడ్లపై వాహనాల పార్కింగ్ చేయడం వంటి సమస్యలను అధిగమిస్తుందని పేర్కొన్నారు. పాతబస్తీలో చిన్న ప్లాట్లను ఒకటిగా చేసి నిర్మించుకోవడానికి కూడా ఇక నుంచి అనుమతిస్తారు. తొమ్మిది మీటర్ల సెట్‌బ్యాక్ పాటించిన భవనాలకు గ్రీన్ బెల్ట్ నిబంధనను తొలగించింది. వెయ్యి చదరపు మీటర్ల స్థలం ఉన్న వాటికి ‘యు’ ఆకారంలో భవనాలు నిర్మించుకోవడానికి అనుమతిస్తారు. 30 మీటర్లు బఫర్‌స్ట్రిప్ కలిగిన ఆకాశ హార్మ్యాలకు పాదచారులకు సైక్లింగ్ చేసే వారికి 12 అడుగులు వదిలి వేయాలన్న నిబంధనను సడలించింది. భవనాల అనుమతుల విషయంలో పట్టణాభివృద్ధి సంస్థలకు విశేష అధికారులను కల్పిస్తూ తాజాగా విడుదల చేసిన నిబంధనలలో పేర్కొన్నారు. రాజధాని నగరంలో భవన నిర్మాణాల అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని జిహెచ్‌ఎంసి కమిషనర్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది. ఇందులో హెచ్‌ఎండిఎ, వాటర్ వర్క్స ఎండి, సిఎండిఎంఎ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.