తెలంగాణ

బెర్లిన్‌లో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: జర్మన్ పర్యటనలో భాగంగా గురువారం బెర్లిన్ సమీపంలో సమగ్ర సేంద్రియ సమీకృత వ్యవసాయ క్షేత్రంను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బృందం సందర్శించింది. జర్మనీలో వ్యాపార కేంద్రాలు (మాల్స్) తరహాలో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయని, ఒకేచోట అన్ని రకాల కూరగాయలు, ఇతర ఆహార పదర్థాలు, మేక, ఆవుపాలు, వ్యవసాయ క్షేత్రం వద్దే విక్రయశాలలు ఏర్పాటు చేయడంతో రైతుతో పాటు 136 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని మంత్రి తెలిపారు. జర్మనీలో సమీకృత సమగ్ర సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలకు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పంటకాలనీలతో పాటు ఈ తరహా వ్యవసాయ క్షేత్రాలకు ప్రోత్సాహం ఇస్తే మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని, సేంద్రియ వ్యవసాయానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని, సమీకృత సమగ్ర వ్యవసాయ క్షేత్రాలతో ఉపాధితో పాటు రైతులకు అదాయం భాగం వస్తుందని మంత్రి ఆభిప్రాయం వ్యక్తం చేశారు.