తెలంగాణ

ట్యాంక్ బండ్ మార్చ్‌కి కాంగ్రెస్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధనకు శనివారం తలపెట్టిన ట్యాంక్ బండ్ మార్చ్‌కి మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. నెల రోజులకు పైగా ఆర్టీసీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యంగా, నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా జేఏసీ తమ మద్దతు కోరిందన్నారు. అందుకోసం శనివారం తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, గతంలో మిలియన్ మార్చ్ ఎలా జరిగిందో, ఆర్టీసీ జాక్ ట్యాంక్ బండ్ కార్యక్రమం అలాగే విజయవంతమవుతుందన్నారు. ముందస్తు అరెస్టులకు భయపడే ప్రసక్తిలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, పోలీసులు భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని, ఎల్లకాలం కేసీఆర్ కుటుంబమే అధికారంలో ఉండదన్నారు. ఆర్టీసీ కార్మికులను కోర్టు రక్షిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశించాలి
దేశం ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుందని, దీనికి కారణమైన ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించేవరకు ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
శుక్రవారం ఇక్కడ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం కుంతియా విలేఖర్లతో మాట్లాడుతూ బంగారాన్ని అమ్ముకుని దేశాన్ని పాలించే పరిస్థితిని బీజేపీ తీసుకువచ్చిందన్నారు.
నెహ్రూ హయాంలో వచ్చిన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ అమలు చేయడం లేదన్నారు. అదేవిధంగా తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పిగొడుతామన్నారు. నోట్లను రద్దు చేసి దేశాన్ని ఆర్థికంగా వెనక్కి నెట్టారన్నారు. ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను దివాలా తీయించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలన్నారు. జీఎస్‌టీ విధానాలను సరళీకృతం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్థికి ఇతోధికంగా నిధులు ఇవ్వాలన్నారు. పంట ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధరలు ఇవ్వాలన్నారు. ఎగుమతులను ప్రోత్సహించాలన్నారు. వౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించాలన్నారు. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మోదీ, కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో బీజేపీ పాలన గతి తప్పిందని, జీడీపీ 3 శాతానికి పడిపోయిందన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయవద్దని తాము గవర్నర్‌ను కోరామన్నారు. ర్యాలీకి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. పోలీసులు అప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నారని, విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద అవినీతి స్కాం చోటుచేసుకుందన్నారు.