తెలంగాణ

ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంకుబండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడలో ప్రైవేటు బస్సులకు అనుమతిపై ఇచ్చిన నిర్ణయంపై కోర్టు స్టే ఇచ్చిన అరగంటకే నాటి సీఎం నీలం సంజీవరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శిర్గ సభ్యులు పశ్యపద్మ, ఎస్ బాలమల్లేశ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టులో జరిగిన ప్రతివాదనలో ప్రభుత్వాన్ని నిందితుడిలా నిలబెట్టిందని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటే ఆర్టీసీకి చెందిన రెండు లక్షల కుటుంబాలు, కోటి మంది ప్రయాణీకులు, వారిపై ఆధారపడిన మరో రెండుకోట్ల మంది కడుపు కాలితే ప్రభుత్వంపై తిరగబడరా? అని నారాయణ ప్రశ్నించారు. కడుపుకాలిన తర్వాత ప్రజలు వారి దారి వారు చూసుకుంటారని అన్నారు. సీఎంకే ప్రజాస్వామ్యంపై గౌరవం లేకపోతే ఇక ప్రజలకు ఆయనపై ఏం గౌరవం ఉంటుంది అని ప్రశ్నించారు. ప్రజలే శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకుంటారని అన్నారు. భూ ప్రక్షాళన లోపాల ప్రతిఫలమే తహసీల్దార్ ఘటన అని వ్యాఖ్యానించారు. సీఎం నియంతలా వ్యవహరించరాదని, ఇప్పటికైనా బేషరతుగా చర్చలకు కార్మికులను ఆహ్వానించాలని అన్నారు.
బ్యూరోక్రాట్స్ ఆత్మగౌరవం చంపుకోవద్దు
గౌరవమర్యాదలున్న ఐఏఎస్ అధికారులు కోర్టులో ఎంతో బాధతో నిలుస్తున్నారని కోర్టు అడిగే ప్రశ్నలకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికే అవమానమని అన్నారు. వారంతా కేసీఆర్ ప్రతినిధులుగా కోర్టుకు వెళ్తున్నారని, సీనియర్ అధికారులు ఆత్మగౌరవంతో బతకాలని నారాయణ సూచించారు.
నిజాం నవాబు కాలంలో ఏర్పాటైన ఆర్టీసీ సంస్థ మాయమవుతుంటే కార్మికులకు మద్దతుగా ఎంఐఎం ఇప్పటికైనా బయటకు రాదా అని నారాయణ ప్రశ్నించారు. కార్మికుల పక్షాన ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఎంఐఎం నిలదీయాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు పెట్టిన డెడ్‌లైన్ కేసీఆర్‌కు డెడ్‌లైన్‌గా మారిందని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెను పక్కదారి పట్టించేందుకే మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా పేర్కొంటున్నారని నారాయణ అన్నారు.
సర్కార్ నోటికి కుట్లు
సీఎం తన తలను కింద , కాళ్లను పైనా పెట్టినా ఆర్టీసీ ప్రైవేటుపరం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటు బస్సుల నిర్ణయానికి హైకోర్టు స్టే ఇవ్వడంతో వారి నోళ్లకు కుట్లు పడ్డాయని, ఇపుడు దీనిపై సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సమ్మెపై ఇప్పటికైనా మంత్రులు నోరు విప్పాలని అన్నారు. చట్టానికి అతీతంగా ఉంటామంటే కుదరదని అన్నారు. ఐఏఎస్‌లు తలదించుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
విజయవంతం: సీపీఐ ఎంఎల్
ఛలో ట్యాంకుబండ్ సకల జనుల సామూహిక దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారావులు పిలుపునిచ్చారు. కాగా వేరొక ప్రకటనలో ఆర్టీసీ పరిరక్షణకు ఛలో ట్యాంకుబండ్ విజయవంతం చేయాలని హైదరాబాద్ సిటీ సీపీఐ కార్యదర్శి ఈటీ నరసింహ వేరొకప్రకటనలో పిలుపునిచ్చారు. ఆరు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రయాణాలకు ఇబ్బంది పడుతున్నారని , ప్రజల గోడు పట్టించుకోని ప్రభుత్వ తీరు అతి కిరాతకమైనదని ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ పేర్కొన్నారు.