తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన సుభాష్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్‌గా నియమితులైన శేరి సుభాష్‌రెడ్డి శుక్రవారం సంస్థ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సమక్షంలో శేరి సుభాష్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మంత్రులు ఈటల, నాయిని నర్సింహ్మారెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తీగల కృష్ణారెడ్డి, టిఆర్‌ఎస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సుశీలారెడ్డి, పెద్ద సంఖ్యలో టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయ కార్యదర్శిగా ఉన్న శేరి సుభాష్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని అన్నారు.

ఇంజనీరింగ్ సీట్ల
కేటాయింపు నేడు

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో శనివారం ఉదయం 11 గంటలకు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు చేయనున్నట్టు సాంకేతిక విద్యాశాఖా కమిషనర్ డాక్టర్ ఎం వి రెడ్డి తెలిపారు. అభ్యర్ధులు తమ అలాట్‌మెంట్ ఆర్డర్లు డౌన్‌లోడ్ చేసుకుని ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు. తెలంగాణ జెఎన్‌టియు పరిధిలో158 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతించారు. మొత్తం 158 కాలేజీల్లో 671 కోర్సులకు అనుమతి లభించింది. 79705 ఇంజనీరింగ్ సీట్లు విద్యార్ధులకు అందుబాటులోకి వచ్చాయి.కాగా బైపిసి కౌనె్సలింగ్‌లో 25వేల మందిని పిలవగా కేవలం 1738 మంది మాత్రమే సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. అందులో 370 మంది వెబ్ ఆప్షన్లు రిజిస్టర్‌చేశారు. డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన అడ్మిషన్ల ప్రక్రియలో సీటు రాని వారికి మాత్రమే తుది ఎంపిక అవకాశం ఉంటుందని కాలేజీయేట్ కమిషనరేట్ అధికారులు తెలిపారు. తుది కౌనె్సలింగ్ జూలై చివరిలో జరుగుతుందని, ఇప్పటికే సీట్లు వచ్చిన వారు అంత వరకూ ఎదురుచూడవద్దని అధికారులు పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.
పాఠశాల విద్య కమిషనర్‌గా అశోక్
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇన్‌చార్జిగా డాక్టర్ ఎ అశోక్ నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్ జి కిషన్ వైద్య అవసరాల నిమిత్తం ఈ నెల 12 నుండి 23వ తేదీ వరకూ సెలవులో వెళ్లడంతో అశోక్‌ను ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించింది.