రాష్ట్రీయం

జీనోమ్ వ్యాలీ రెండో దశకు 350 ఎకరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: జీవశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి నిలయంగా మారిన జీనోమ్ వ్యాలీకి మహర్దశ పట్టింది. జీనోమ్ వ్యాలీ 2.0కు మాస్టర్ ప్లాన్‌ను రాష్ట్రప్రభుత్వం రూపొందించింది. ఈ వ్యాలీ విస్తరణకు అదనంగా 350 ఎకరాలను సేకరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల జీవశాస్త్ర రంగంలో పరిశోధనలు ఊపందుకుంటాయి. ఫార్మాసూటికల్, బయోటెక్నాలజీ పరిశోధనలు, వినయోగదారుల ఉత్పత్తులను తయారుచేసే కంపెనీలు పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇక్కడ వౌలిక సదుపాయాల కల్పనకు బ్లూప్రింట్‌ను కూడా ఖరారు చేశారు. 350 ఎకరాల సేకరణకు సంబంధించి సర్వే పనులు కూడా పూర్తయ్యాయి. బయోటెక్ పార్కులు, ఐకేపీ నాలెడ్జ్ పార్కుల సంస్థలు కోరితే అదనంగా భూములను కేటాయించేందుకు రాష్ట్రప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. సామాజిక వౌలిక సదుపాయాల ఏర్పాటులో కంపెనీలను భాగస్వాములను చేయనున్నారు. చిన్న, మధ్య తరహా జీవశాస్త్ర పరిశోధన సంస్థలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించారు. వాస్తవానికి 1999లో
జీనోమ్ వ్యాలీకి అంకురార్పణ జరిగింది. శామీర్‌పేట ప్రాంతంలో జీనోమ్ వ్యాలీని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతానికి రియాల్టీపరంగా మహర్దశ పట్టింది. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో 18 దేశాలకు చెందిన 200 కంపెనీలు పనిచేస్తున్నాయి. దాదాపు పదివేల మంది శాస్తవ్రేత్తలు పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 56 ఇంక్యుబేటర్లు ఉన్నాయి. ఇందులో 18 ఇంక్యుబేటర్లు జీనోమ్ వ్యాలీలో ఉన్నాయి. దేశంలో జీవశాస్త్ర విభాగంలో జీనోమ్ వ్యాలీ అతి పెద్ద క్లస్టర్‌గా పేరు తెచ్చుకుంది. బయాలజీ శాస్త్ర కంపెనీలకు జీనోమ్ వ్యాలీ లక్ష్యంగా మారింది. జీఈ హెల్త్‌కేర్ సంస్థ ఫ్లిక్ ఫ్యాక్టరీ క్లినికల్ డెవలప్‌మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల వ్యాక్సిన్ల పరిశోధనలు ఊపందుకుంటాయి. అగ్రిటెక్, క్లినికల్ రీసెర్చి మేనేజిమెంట్, బయోఫార్మా, వ్యాక్సిన్ మానుఫ్యాక్చరింగ్, రెగ్యులేటరీ అండ్ టెస్టింగ్ ఇతర అంశాలపై ఇక్కడ శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల భాగస్వామ్యంతో పరిశోధన, అభివృద్ధి నిమిత్తం వౌలిక సదుపాయాలను తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ ఏర్పాటు చేస్తోంది.
*ఫైల్‌ఫొటో