తెలంగాణ

అమెరికా అబ్బాయి.. పాలమూరు అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: అమెరికా అబ్బాయితో పాలమూరు అమ్మాయికి వివాహం జరిగింది. ఆదివారం హైదరాబాద్‌లోని టూరిజం హోటల్‌లో వీరిద్దరి విహహం ఘనంగా జరిగింది. ఈ వివాహాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దగ్గరుండి నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వర్షిణి, అమెరికాలోని డల్లాస్‌కు చెందిన హేన్రిహుడ్‌గ్రీన్‌తో వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే వీరిదరూ ఒకరికొకరు ఇష్టపడటం, పెళ్లి చేసుకోవాలని నిర్ణయంచుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా వీరి వివాహనికి ఒప్పుకున్నారు. దాంతో హిందూ సంప్రదాయ ప్రకారం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లోని టూరిజం హోటల్‌లో నిర్వహించారు. పెళ్లి దగ్గరుండి చేయించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.

*చిత్రం...నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్