తెలంగాణ

నేటి కన్నా నాటి విజ్ఞానమే మిన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 10: అంతరిక్షానికి చేరుకున్నామని ఆనందిస్తున్న నేటి సమాజానికి నాటి విజ్ఞానమే మిన్నగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె.జానారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం పసల్‌వాది గ్రామ శివారులో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న శ్రీ కైలాస ప్రస్తార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న సప్త సరస్వతీ సమార్చన కార్యక్రమంలో రెండవ రోజు చేపట్టిన నాట్య ప్రదర్శన కార్యక్రమానికి జానారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంత్రిక పద్ధతులకు అలవాటు పడిన నేటి సమాజంలో ఎన్నో నిర్మాణాలు చేస్తున్నారని, వాటన్నింటికీ స్టీలు, సిమెంటును తప్పకుండా ఉపయోగిస్తున్నారని తెలిపారు. పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి మాత్రం సున్నం, బెల్లం, ఇసుక, జనుము, మారేడు రసం, కరక్కాయ తదితర అష్టదాతువుల మిశ్రమంతో వందల సంవత్సరాల ఆయు ప్రమాణాలతో నిర్మించడం అద్భుతమైందన్నారు. నాటి రాజుల కాలంలో ఉపయోగించిన చారిత్రక పద్ధతుల్లో నిర్మిస్తున్న శైవాలయం సంగారెడ్డికే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తయ్యేలోగా తాను ఏ హోదాలో ఉన్నా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా హామీఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ క్రిష్ణంరాజు మాట్లాడుతూ మహత్తరమైన ఆలయ నిర్మాణం గావిస్తూనే సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను చేపడుతూ సంస్కృతి, సంప్రదాయలను భవిషత్ తరాలకు అందిస్తున్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు సిద్ధాంత భాస్కర బిరుదాంకితులైన డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతిని అభినందించారు. ఎన్నో విశేషాలతో భక్తులకు అందుబాటులోకి వస్తున్న మహామేరు నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం అందించాలని సభాముఖంగా కోరారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని పునర్‌నిర్మాణం చేయిస్తున్నట్టుగానే ఈ మందిరంపై కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. స్థానిక శాసన సభ్యుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ మహామేరు కాదు మహాపర్వతాన్ని నిర్మించడానికి తనవంతు ఎళ్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. 1008 మంది నాట్య కళాకారులు సరస్వతీ అమ్మవారి సమక్షంలో నృత్య ప్రదర్శనను సమర్పించడం హర్షణీయమన్నారు. ఎంతో సాధన చేస్తే కానీ ఏకకాలంలో ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయలేమని, ఇం దుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ రెండు రోజులుగా నిర్వహిస్తున్న సప్త సరస్వతీ సమర్చన కార్యక్రమానికి ఆశేషంగా తరలివచ్చిన భక్తులకు, రేయింబవళ్లు శ్రమించిన విద్యాపీఠం సభ్యులకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలిపారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి చివరగా అనుగ్ర భాష ణం చేస్తూ మహామేరు ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తిస్థాయి బాధ్యతగా చేపట్టాలంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సరస్వతీ పుత్రుడుగా బిరుదును ప్రకటించారు. ప్రముఖ కూచీపూడి నృత్య కళాకారురాలు, ఎస్పీ భారతీ ఆధ్వర్యం లో అమ్మవారికి నృత్య సమర్పణ చేసారు. కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమనం నిర్వహించారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమంలో అద్భుతంగా నిర్మితమవుతున్న శ్రీ కైలాస ప్రస్తార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి ఆలయ నిర్మాణ శైలీని సందర్శించడం విశేషం.
*చిత్రం...సప్త సరస్వతీ సమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జానారెడ్డి