తెలంగాణ

సర్కార్‌కు ఆర్టీసీ సమ్మె ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదారాబాద్, నవంబర్ 10: సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవకుండా కాలాపహరణం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి ఈ సమ్మె ఉచ్చుగా మారుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, తమ డిమాండ్ల కోసం శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల శనివారం పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేయడం దారుణమన్నారు. చరిత్రలో నవంబర్ 9 నిలిచిపోతుందన్నారు. కార్మికుల ఉసురు కేసీఆర్ తగులుతుందన్నారు. ఇకనైనా తన తప్పిదాలను తెలుసుకుని ఆర్టీసీ యూనియన్లను చర్చలకు పిలవాలన్నారు. చలో ట్యాంక్ బండ్ సందర్భంగా ఆంక్షలు విధించడమేంటన్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆందోళనలో పాల్గొన్న వారికి మావోయిస్టుల మద్దతు ఉందని మాట్లాడడం తగదన్నారు. అయోధ్య రామజన్మభూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానించారు. హిందువులకు, ముస్లింలకు న్యాయం చేసే విధంగా కోర్టు తీర్పు ఉందన్నారు. శతాబ్థాల తరబడి మందిర వివాదం కొనసాగుతోందన్నారు. ఈ తీర్పును కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానించారన్నారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోర్టు తీర్పుపై చేసిన వ్యాఖ్యలు తగవన్నారు. ఒవైసీకి రాజ్యాంగం, కోర్టుల మీద నమ్మకం లేదన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డు కూడా ఈ తీర్పును స్వాగతించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ తీర్పుతో భారత రాజ్యాంగం గెలిచిందన్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించారన్నారు. అత్యంత సంక్లిష్టమైన, జఠిలమైన ఈ వివాదాన్ని సుప్రీంకోర్టు ఎవరిని నొప్పించకుండా చక్కగా పరిష్కరించిందన్నారు. దేశ ప్రజలు విబేధాలు విస్మరించి అభివృద్థికి అంకితం కావాలని ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారన్నారు. బీజేపీలో చేరిన కరీంనగర్ జిల్లాకు చెందిన అనేక మంది పార్టీ నేతలకు కండువా కప్పి స్వాగతించారు.

*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్