తెలంగాణ

మంత్రి కేటీఆర్‌కు ప్రతిష్టాత్మక ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియా-ఆస్ట్రేలియా లీడర్ షిప్ సదస్సుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లో డిసెంబర్ 8,9 తేదీలలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో లీడర్ షిప్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. నిర్వహకుల నుంచి మంత్రి కేటీఆర్‌కు ఈ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా ఆదివారం ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా-ఇండియా రెండు దేశాలకు చెందిన వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ రంగంలోని ప్రభావశీల, నిర్ణయాత్మక ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఆస్ట్రేలియా-ఇండియా మధ్య సంబంధాలు, వివిథ ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాలు, ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను బలోపేతం చేసే దిశగా ఈ సదస్సులో చేర్చినున్నట్టు నిర్వహకులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు పై చదువుల కోసం ఎక్కువ మంది ఆస్ట్రేలియాను ఎంచుకుంటున్న నేపథ్యంలో విద్యా, టెక్నాలజీ రంగాలపై పెట్టుబడుల గురించి ఈ సదస్సులో చర్చించనున్నట్టు నిర్వహకులు పంపించిన ఆహ్వానంలో నిర్వహకులు పేర్కొన్నారు.
*చిత్రం...మంత్రి కేటీఆర్‌