తెలంగాణ

జాతీయ ప్రగతి బాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 4: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1800 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు రూ.41వేల కోట్లు వెచ్చించనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. సోమవారం వరంగల్ నగరం మడికొండ వద్ద యాదగిరిగుట్ట నుంచి వరంగల్ ఆరెపల్లి వరకు 1905 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 340 కోట్ల వ్యయంతో గోదావరిపై నిర్మించిన ముళ్లకట్ట బ్రిడ్జిని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కలిసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణకు కేంద్ర సహకారం అవసరమంటూనే, 1800 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు మంజూరు చేసిన నితిన్ గడ్కరీ సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోయేది లేదన్నారు. మా ప్రజలు ‘కిస్‌కా ఖాతే ఉస్‌కా గాతే’ అని చమత్కరించారు. మడికొండ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో తొలుత గడ్కరీ మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించి 480 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) సిద్ధంగా ఉందన్నారు. 5వేల కోట్లతో అభివృర్చపర్చనున్నట్టు తెలిపారు. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి పంపిస్తే ఈ ఏడాదే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. జాతీయ రహదారులతో పాటు రాష్ట్రంలో 1600 కోట్ల వ్యయంతో రెండు ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించేందుకు కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. జాతీయ రహదారులతోపాటు అంతర్గత జల రవాణా మార్గాలను అభివృద్ధిపర్చేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే జలరవాణా మార్గం వినియోగంలో దేశం అత్యంత వెనుకబడి ఉందన్నారు. కేవలం 3.5 శాతం మేరే జల రవాణా మార్గాలను వినియోగించుకున్నట్టు తెలిపారు. దేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై జల రవాణా మార్గాలను అభివృద్ధి పర్చనున్నట్టు వెల్లడించారు. దీనిద్వారా మత్స్యరంగం, పర్యాటకరంగం అభివృద్ధి సాధ్యమన్నారు. కాలుష్య నివారణకు ఎలక్ట్రికల్ బస్సులు వినియోగంలోకి తెస్తామన్నారు. బయోడిజీల్ ఉత్పత్తులు రైతులు తయారు చేయగలిగితే కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 3 లక్షలమంది వికలాంగులుగా మారుతున్నారని, మరో 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దేశంలో 22 శాతం డ్రైవర్ల కొరత ఉందని, సరైన శిక్షణలేని డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు శిక్షణ పొందిన డ్రైవర్లు అవసరమన్నారు. ఇందుకు కేంద్రం ఈ-గవర్నెన్స్‌లో నూతన మోటర్ వెహికిల్ చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. ఎన్‌హెచ్‌లపై ప్రమాదాల నివారణకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఇందుకుగాను దేశంలో 26 జనవరి నాటికి 300 రైలు ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి) నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఇందులో 12 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో వౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
కేంద్రంతో కలిసే పని చేస్తాం:కెసిఆర్
రాష్ట్భ్రావృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని కెసిఆర్ పేర్కొన్నారు. ముంబయి నుండి పుణే వరకు రోడ్లు అభివృద్ధి చేసిన ఘనత మీదేనని మంత్రి గడ్కరీని ప్రశంసించారు. దక్షిణ భారతదేశంలో నేషనల్ హైవేలు తక్కువగా ఉన్నాయని, తెలంగాణకు మరిన్ని నేషనల్ హైవేలు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తిరిగి ప్రారంభించే చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి మరిన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జిలను మంజూరు చేయాలన్నారు. వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్‌హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ తరువాత వరంగల్ అతిముఖ్యమైన పట్టణమని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ హెల్త్ యూనివర్సిటీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్‌లాంటి ఎన్నో పథకాలు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమానికి డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అధ్యక్షత వహించగా కేంద్ర కార్మిక మంత్రి భండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు అజ్మీరాచందూలాల్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపిలు బూర నర్సయ్యగౌడ్, సీతారాంనాయక్, పసునూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... వరంగల్ సభలో జ్యోతిప్రజ్వలన చేస్తున్న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, సిఎం కెసిఆర్