తెలంగాణ

ఉద్యోగులకు కేసీఆర్‌పై నమ్మకం సన్నగిల్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: ప్రభుత్వం తీరుతెన్నులు గమనిస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బోనస్ ఇవ్వలేమని డబ్బు లేదని చెబుతున్న ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. గత కొద్దికాలంగా ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, కానీ నేడు వారిని పిలిచి పీఆర్సీ ఇస్తామని, పది రోజుల్లో 42 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తోందని అయితే వీటిని ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తిగా లేరని, అసంతృప్తితోనే ఉన్నారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మార్వో హత్యను ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను నిలదీయాలని, లంచం అడిగిన వారిని చెప్పుతో కొట్టండి అంటూ గతంలో మంత్రులే పేర్కొన్నారని, దాని పర్యవసానం, ప్రభుత్వ చేతకానితనం వల్లనే ఇలాంటి సంఘటనలు జరిగాయని అన్నారు. లంచగొండి అధికారులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని, అలా ఎవరికోసం ఎందుకోసం చేశారో చెప్పాలని ఇంద్రసేనారెడ్డి నిలదీశారు. ఏసీబీ పెట్టిన కేసుల్లో ఎంతమందికి శిక్ష పడిందో, ఎంతమందికి రిలీఫ్ ఇచ్చారో బహిర్గతం చేయాలని అన్నారు. సీసీఎల్‌ఏ భూరికార్డుల పోస్టులకు ఫుల్‌టైం అధికారులు లేరని, గతంలో కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు ఉండేవని, ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని, గతంలో ఉద్యోగుల్లో భయం ఉండేదని, ఈ ప్రభుత్వం వాటన్నింటినీ తీసేసిందని పేర్కొన్నారు. భూమికి సంబంధించి అసలు రికార్డులు సర్వే లాండ్ సెటిల్‌మెంట్ శాఖ వద్ద ఉండాలని, ఆ శాఖకు సంబంధించి ప్రతి జిల్లాలో అధికారులు ఉండాలని, కానీ 23 జిల్లాల్లో అలాంటి అధికారులు లేనేలేరని చెప్పారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించనక్కర్లేదా అని ఇంద్రసేనారెడ్డి నిలదీశారు. ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయకుండానే భూ రికార్డులను మార్చడం వల్లనే సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు భూములను కాజేయడానికి, తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయడానికి కొత్త నిబంధనలు తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలకు లబ్ది చేకూరకపోగా, కొత్త సమస్యలు తలెత్తాయని చెప్పారు.