తెలంగాణ

ఆరేళ్లు గడచినా ఎక్కడి సమస్యలు అక్కడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలో ఆరేళ్లుగా పాఠశాల విద్య సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసింది. ప్రతినిధి బృందంలో పీ వెంకటరెడ్డి, పీ సరోత్తమరెడ్డి, జీ మల్లిఖార్జున శర్మ, నరహరి లక్ష్మారెడ్డి, టీ ప్రభాకర్, కే విజయలక్ష్మి తదితరులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం లేకపోవడం, ప్రీ నర్సరీ, నర్సరీ లేకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్నారని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. మూడేళ్లు దాటిన ప్రతి ఒక్కరికి నిర్బంధంగా ఉచిత విద్యను అందించాలని వారు కోరారు. పాఠశాల విద్యలో పర్యవేక్షణ కొరవడిందని, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు, ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న వారికీ ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలులోకి రాకపోవడంతో అదో పెద్ద సమస్యగా తయారైందని, పదోన్నతులు లేకుండానే వేలాది మంది టీచర్లు రిటైరవుతున్నారని వారు పేర్కొన్నారు. 33 జిల్లాల్లో 24 జిల్లాల్లో రెగ్యులర్ డీఈఓలు లెరని, అలాగే 56 డిప్యుటీ డీఈఓ పోస్టుల్లోనూ రెగ్యులర్ డిడీఈఓలు లేరని వారు వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 23 జిల్లాల్లోనూ, 150 మండలాల్లోనూ పోస్టులు మంజూరు చేయలేదని, 585 మండలాల్లో 536 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలాగే 2వేల హెచ్‌ఎం పోస్టులు, 5వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 5వేల జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు చెప్పారు. 2015 జూలై తర్వాత టీచర్లకు పదోన్నతులు కల్పించలేదని, అలాగే సరిపడా బడ్జెట్ కేటాయింపులు లేక పాఠశాల విద్య కుచించుకుపోతోందని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం స్కూళ్లలో కంప్యూటర్ విద్య ఉండేదని, ఇపుడు దానిని కూడా ఆపేశారని అన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు.