తెలంగాణ

హైకోర్టు ఆదేశాలపై న్యాయ నిపుణులతో సీఎం సమాలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పాలని హైకోర్టు ఆదేశించడంతో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బుధవారమే హైకోర్టుకు తెలియజేయాల్సి ఉన్న నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి మంగళవారం సాయంత్రం సీఎం ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, అడ్వకేట్ జనరల్ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తదితర ఉన్నతాధికారులు సీఎంతో సమావేశమై హైకోర్టు ఆదేశాలను వివరించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై న్యాయాధికారులతో సీఎం సమాలోచనలు జరిపారు. ఈ అంశాన్ని న్యాయమూర్తుల కమిటీకి అప్పగించడం వల్ల తలెత్తే పరిణామాలపై న్యాయ నిపుణులు, న్యాయాధికారులను సీఎం ఆరా తీశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం అంగీకరించడం వల్ల ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సి ఉంటుందని, ఆ తదుపరి పరిణామాలు న్యాయమూర్తుల కమిటీ చేసే సిఫారసులపై ఆధారపడి ఉంటుందని న్యాయాధికారులు వివరించినట్టు తెలిసింది. ఈ కమిటీకి చట్టబద్ధత ఉంటుందా? అనే అంశంపై కూడా న్యాయనిపుణులతో చర్చించినట్టు తెలిసింది. కాగా, హైకోర్టు సూచనపై ప్రభుత్వ స్పందనను అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించాల్సి ఉండడంతో ప్రభుత్వ నిర్ణయంపై గోప్యతను పాటిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం.
*చిత్రం...ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు