తెలంగాణ

సీఎం భేషజాలకు పోవొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చల ప్రక్రియను కొనసాగించాలని వామపక్ష పార్టీల నేతలు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి అనేక రకాలుగా హైకోర్టు ప్రయత్నిస్తున్నా పరిష్కారం లభించకపోవడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రెండు నెలలు దాటినా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు పండగల పూట కూడా పస్తులుండే పరిస్థితి దాపురించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని, సమ్మె వల్ల సామాన్య ప్రజలకు ప్రయాణం భారంగా మారిందని అన్నారు. ప్రైవేటు రవాణా వల్ల అధికార చార్జీలు ప్రజల నుండి వసూలు చేస్తున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నెలల తరబడి సమ్మెలు కొనసాగడం బాధాకరమని అన్నారు. హైకోర్టు వ్యాఖ్యలను గమనంలోకి తీసుకుని సీఎం కేసీఆర్ సమ్మెను సానుకూలంగా పరిష్కరించాలని వెంకటరెడ్డి కోరారు. సమ్మె సుదీర్ఘకాలం కొనసాగడం ఎవరికీ మంచిది కాదని అన్నారు.
ఆర్టీసీ సమ్మె పరిష్కరించడానికి హైకోర్టు చేస్తున్న సామరస్య ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఆర్టీసీ కార్మికులు కుటుంబ సభ్యులని పేర్కొంటూనే సీఎం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటకే 30 మందికి పైగా చనిపోయారని, వందలాది మంది లాఠీదెబ్బలకు గురయ్యారని, ప్రభుత్వం నిరంకుశంగా ఉన్నా, జేఏసీ నాయకత్వం చర్చలు జరపడానికి సిద్ధపడి అనేక రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సానుకూల వైఖరితో సమ్మె పరిష్కారానికి కోర్టు ముందుకు తగిన ప్రతిపాదనలతో వెళ్లాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం కోరుతున్నట్టు ఆయన చెప్పారు.