తెలంగాణ

ప్రెస్‌మీట్ పెడదామనొస్తే.. అరెస్టులా?: న్యూడెమొక్రసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించేందుకు వచ్చిన నేతలను పోలీసులు అరెస్టు చేయడం తగదని సీపీఐఎంఎల్ న్యూడెముక్రసీ కార్యదర్శి డీవీ కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారాలులు పేర్కొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం అఖిల భారత అధ్యక్షుడు వీ వెంకట్రామయ్య, ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి కే సూర్యం, ఎసీఎఫ్ నేత మోహన్ బైరాగిలతో పాటు మైనార్టీ సంస్థకు చెందిన మరో నేత అమానుల్లాఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారని డీవీ కృష్ణ వివరించారు. హిందూ ఫాసిస్టు వ్యతిరేక వేదిక సభ్యురాలు అనురాధను హౌస్ అరెస్టు చేశారని అన్నారు. అయోధ్య తీర్పుపై ఎవరూ బహిరంగంగా మాట్లాడరాదనే నిబంధన తీర్పులో ఉందని కనుక తాము అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారని, కానీ చెప్పిన కారణం హాస్యాస్పదమైందని అన్నారు.
ఇప్పటికే పత్రికల్లో సంపాదకీయాలు, ప్రముఖుల అభిప్రాయాలు వచ్చాయని, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా బహిరంగంగా తమ అభిప్రాయాలను చెప్పారని అన్నారు. కాగా ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సైతం ఈ అరెస్టులను వేరొక ప్రకటనలో ఖండించారు.