తెలంగాణ

నల్లమలలో మళ్లీ.. యురేనియం అనే్వషణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, నవంబర్ 12: నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని అటవీ భూ భాగంలో, గ్రామాలలో మంగళవారం సాయంత్రం జెట్ విమానం చక్కర్లు కొట్టడంతో అటవీ ప్రాంతంలోని ఆదిమజాతి చెంచులు, ఇతరు వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర భయందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలోని 83 చ.కిమీ పరిధిలో యురేనియం అనే్వషణ కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసిన విషయం విదితమే. ఈ విషయంపై నల్లమల ప్రజలు తీవ్ర ఆందోళన కార్యక్రమాలను చేపట్టడంతో గత సెప్టెంబరు 16న నల్లమల ప్రాంతం సహా తెలంగాణలో ఎక్కడా కూడా యురేనియం తవ్వకాలను జరుగనీయమని రాష్ట్ర ఉభయ సభలలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో ఈ సమస్యకు తెరపడినట్టేనని ప్రజలు భావిస్తున్న తరుణంలో ఇప్పటికి రెండు మార్లు జెట్ విమానాలు భూమికి అతి సమీపంలో ఆకాశంలో చక్కర్లు కొట్లడం దేనికి సంకేతమని నల్లమల యురేనియం వ్యతిరేక రాజకీయ జేఏసీ కన్వీనర్ నాసరయ్య ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి యురేనియం తవ్వకాలను చేపట్టాలని యూసిఐయల్ కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలను జరుగనివ్వమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఇక్కడి ప్రజలు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.