తెలంగాణ

ఠాణా ఆవరణలో నిందితుల మద్యపానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, నవంబర్ 12: కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల పోలీసుస్టేషన్ ఎస్‌ఐ సస్పెండ్ అయ్యారు. ఠాణా ఆవరణలో అరెస్ట్ అయిన కొందరు నేతలు మద్యం సేవించడం, దానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ కావడంతో, జిల్లా ఎస్పీ శే్వత ఈ సంఘటనపై విచారణ జరిపి మాచారెడ్డి ఎస్‌ఐ మురళీని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. ఇటీవల జరిగిన ఆర్టీసీ మిలీనియం మార్చ్ ఆందోళన కార్యక్రమానికి హైదరాబాద్‌కు వివిధ రాజకీయ పార్టీల నేతలు వెళ్లకుండా పోలీసులు జిల్లాకు చెందిన కొందరు నేతలను అరెస్ట్ చేసి జిల్లా సరిహద్దు ప్రాంతంలోని మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు నేతలు పోలీసుస్టేషన్ ఆవరణలోని చివరన ఉన్న గోడ పక్కన చెట్లకింద రహస్యంగా మద్యం సేవించారు. వారిలో నుండే ఒకరు తీసిన సెల్ఫీ ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయం తెల్సుకున్న జిల్లా ఎస్పీ దానిని సీరియస్‌గా తీసుకుని ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారణ కావడంతో ఎస్‌ఐ మురళీని సస్పెండ్ చేశారు.
*చిత్రం... సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ అయిన ఫొటో ఇదే..