తెలంగాణ

కృష్ణా తుంగభద్ర నదులకు కార్తీక పున్నమి శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 12: కృష్ణా, తుంగభద్ర నదులకు కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. మంగళవారం కార్త్తీక పౌర్ణమి కావడంతో కృష్ణా, తుంగభద్ర నదులకు భక్తులు పోటెత్తారు. అందులో భాగంగా సోమశిల కృష్ణా సంగమం దగ్గర కార్తీక దీపాలను నదిలో వదిలేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అక్కడి సోమేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా బీచ్‌పల్లి దగ్గర గల కృష్ణానదికి కార్త్తీక పౌర్ణమి శోభ ఉట్టిపడింది. తెల్లవారుజాము నుండే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నదిలో కార్త్తీక దీపాలను వదిలారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో నది దగ్గర పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను సైతం ఉంచి అప్రమత్తం చేశారు. హైదరాబాద్ నుండి బెంగళూర్ వెళ్లే ప్రధాన రహదారిపై బీచ్‌పల్లి కృష్ణానది ఉన్నందున భక్తులు పోటెత్తారు. కృష్ణానది నిండుకుండలా ప్రవహిస్తుండటం, దాంతో భక్తులు సైతం అధిక సంఖ్యలో రావడంతో బీచ్‌పల్లి ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి పోయింది. అక్కడి శివాలయం, రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇకపోతే ఐదవ శక్తి పీఠం జోగుళాంబ సన్నిధిలో సైతం కార్త్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తుంగభద్ర నది ఒడ్డున గల జోగుళాంబ అమ్మవారిని కార్త్తీక పౌర్ణమి రోజున దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. తుంగభద్ర నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలను వదిలారు. కార్త్తీక దీపాలను వదిలిన భక్తులు జోగుళాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అమ్మవారి ఆలయంలో కార్త్తీక మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను భక్తులు వెలిగించారు. కాగా జోగుళాంబ అమ్మవారిని పలువురు ప్రముఖులు సైతం దర్శించుకున్నారు. కృష్ణానది తీరాన గల శివాలయాలు భక్తుల రద్దితో కనిపించాయి. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది ప్రారంభమయ్యే తంగిడి, కృష్ణానది బిడ్జి దగ్గర కూడా భక్తులు పోటెత్తారు. జూరాల ప్రాజెక్టు దగ్గర సైతం కార్తీక దీపాలను నదిలో వదిలేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో కిలోమీటర్ల మేర అటువైపు వెళ్లే రోడ్డు వెంట వాహనాల రద్దీ నెలకొంది. ప్రధాన పుష్కరఘాట్ల దగ్గర మాత్రం పోలీసు బందోబస్తు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.
*చిత్రాలు.. బీచ్‌పల్లి వద్ద కృష్ణానదిలో, జోగుళాంబ సన్నిధిలో దీపాలను వెలిగిస్తూ పుణ్యస్నానాలు ఆచరిస్త్తున్న భక్తులు
*కృష్ణానది సోమశిల సంగమం వద్ద పూజల సందడి