రాష్ట్రీయం

వంటల్లోనూ అదరహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: సివిల్ సర్వీసెస్‌కు చెందిన 140 మంది ట్రైనీ అధికారులు తాము కేవలం పరిపాలనకు సంబంధించిన పరీక్షల్లోనే కాకుండా వంటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా దిట్టలమేనని నిరూపించుకున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ) లో 15 సివిల్ సర్వీసులకు చెందిన 140 మంది ట్రైనీ అధికారులు శిక్షణ పొందుతున్నారు. 94 వ ఫౌండేషన్ కోర్సులో భాగంగా శిక్షణలో ఉన్న అధికారులు బుధవారం ఏర్పాటు చేసిన ‘ఫేట్ ది మేళా’ లో పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు తమ తమ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా వండే వంటకాలను తయారు చేసి విక్రయించారు. విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును స్వచ్ఛంద సేవా సంస్థలకు అందిస్తున్నారు. తూర్పు జోన్‌కు చెందిన అధికారులు చేపల కూర, జల్ముది, పశ్చిమ జోన్‌కు చెందిన వారు గజ్రేలా, మట్టర్ కుల్ఫా, ఉత్తర భారతావనికి చెందిన వారు దాల్ కబాబ్, పంజాబీ లస్సీ, పరాటాలు, దక్షిణ జోన్‌కు చెందిన వారు మసాలా దోశ, అనియన్ ఊతప్పమ్ తదితర వంటకాలను తయారు చేశారు. వినోదాత్మక ఆటలు, పాటల్లో కూడా పాల్గొన్నారు. ట్రైనీ అభ్యర్థులను ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బీ.పీ. ఆచార్య అభినందించారు.

*చిత్రం... హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ)లో బుధవారం నిర్వహించిన ‘ఫేట్ ది మేలా’లో దోశెలు వేస్తున్న ట్రైనీ ఐఏఎస్‌లు