తెలంగాణ

కాచిగూడ ఘటనపై సేఫ్టీ కమిషనర్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: కాచిగూడలో రెండు రోజుల క్రితం జరిగిన ఎంఎంటీఎస్-కర్నూలు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ రైలు ఢీకొన్న ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణను రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్‌కృపాల్ చేపట్టారు. దాదాపు ఆరు గంటలకు పైగా జరిగిన ఈ విచారణలో కాచిగూడ రైల్వేస్టేషన్ మాస్టర్, డివిజన్ రీజినల్ మేనేజర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. రైలు ప్రమాదం జరిగిన ఘటనపై ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు, ప్రమాద సమయంలో పరిసర ప్రాంతాల వారిని కమిటీ విచారించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకు కోనసాగింది. విచారణ అనంతరం ఘటనాస్థలిని విచారణ కమిటీ సభ్యులు పరిశీలించారు. అనంతరం హైదరాబాద్ రైల్ భవన్‌లో కమిటీ మరోసారి రైల్వే ఉద్యోగులను విచారించినట్లు సమాచారం. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదం సాంకేతిక లోపమా? మానవతప్పిదం వల్ల జరిగిందా? అన్న కోణంలో అధికారులు విచారించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్‌కృపాల్ రైల్వే శాఖకు చెందిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు.