తెలంగాణ

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: మార్క్‌ఫెడ్ ద్వారా మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలబడాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, మొక్క జొన్నకు సంబంధించి గత మాసం వరకు మార్కెట్‌లో రూ.2000 నుండి రూ.2500 వరకు పలికిన ధరలు, ప్రస్తుతం పంట చేతికి రావడంతో మొక్క జొన్నకు కనీసం మద్దతు ధర రూ.1760 ఉండగా, మార్కెట్‌లో కేవలం రూ.1500 నుండి రూ.1600 వరకు మాత్రమే వచ్చిందన్నారు. ప్రతి క్వింటాల్‌పై రైతు దాదాపు రూ.200 నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. అతి వృష్టి వల్ల చేతికి వచ్చిన పంటలన్నీ నెలకొరుగుతుండడంతో, పంటనష్టపోయి రైతులు దెబ్బతిన్నారన్నారు. పంట నష్టాన్ని పూడ్చేందుకు రాష్ట్రప్రభుత్వ రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో అంచనాలు రూపొందించాలన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రం ఇన్‌పుట్ సబ్సిడీని అందించే విధంగా తగు చర్యలు చేపట్టడం అత్యవసరమన్నారు.
రైతులను ఆదుకునేందుకు ప్రతి ఎకరానికి రూ.20వేల ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.