తెలంగాణ

మత్స్యకారుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 13: సూర్యాపేట మత్స్యపారిశ్రామిక సంఘంలో సభ్యులకు హైకోర్టు ఆదేశాల మేరకు నైపుణ్య పరీక్షలు నిర్వహించకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు బుధవారం జిల్లాకేంద్రంలోని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ సంక్షేమసంఘం అధ్యక్షుడు సారగండ్ల సురేశ్ మాట్లాడుతూ స్ధానిక మత్స్యసంఘంలో సభ్యత్వ నమోదుపై వివాదం నెలకొనడంతో హైకోర్టును ఆశ్రయించగా జిల్లాకేంద్రానికి చెందిన 189 మంది సభ్యులకు నైపుణ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు సభ్యత్వాలను అందజేయాలని తీర్పునిచ్చినప్పటికీ సంబంధిత మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అర్హతలేని వారికి నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు నిజమైన మత్స్యకారులకు పరీక్షలు నిర్వహించకుండా జాప్యం చేస్తుండటం దారుణమన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చి ఆరుమాసాలు అవుతున్న అధికారులు పట్టించుకోకుండా కోర్టు దిక్కరణ చేస్తున్నారన్నారు. బుధవారం కోర్డు ఉత్తర్వుల మేరకు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తామని నోటిసులు ఇచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి చూసిన పరీక్షలు నిర్వహించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు మత్స్యకారుల సంక్షేమానికి కృషిచేస్తుంటే అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తు వృత్తిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. సంఘం నాయకులు మామిడి సుధీర్, కొండల్, యాట వెంకన్న తదితరులు పాల్గొన్నారు.