తెలంగాణ

పంటల కొనుగోళ్లపై వారానికోసారి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లకు రైతులు తీసుకువచ్చే పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సేద్యం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హాకాభవన్‌లో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, పంటల కొనుగోలు ఏ విధంగా ఉందో పరిశీలించేందుకు వారానికి ఒక రోజు తాను సమీక్ష చేస్తానని, సంబంధిత అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. వేర్‌హౌజింగ్ కార్పోరేషన్ గోదాములను పౌరసరఫరాల శాఖ లేదా సీసీఐ (కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) కు కిరాయికి ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. సీసీఐ నుండి రావల్సిన 45 లక్షల రూపాయలు, పౌరసరఫరాల శాఖ నుండి రావలసిన 148 కోట్ల రూపాయలు రాబట్టుకునేందుకు ప్రయత్నించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా 504 కోట్ల రూపాయలు మార్కెట్ ఫీజు రావలసి ఉండగా 115 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు వచ్చాయని, 2020 మార్చి వరకు మిగతాడబ్బు వచ్చేలా చూడాలని సూచించారు. వ్యాపారులు ఎవరైనా మార్కెట్ ఫీజును ఎగ్గొడితే వారి లైసెన్స్‌లను రద్దుచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి హాజరయ్యారు.