తెలంగాణ

ప్రభుత్వ పనితీరు రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో చర్చలు, రాజీలు లేకుండా పాలన సాగిస్తోందని పీసీసీ నేత మల్లు రవి ధ్వజమెత్తారు.బుధవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న ప్రభుత్వంపైన సుమోటోగా హైకోర్టు కేసును నమోదు చేయాలని ఆయన కోరారు. ఆర్టీసీ కేసు విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల కమిటీకి ఒప్పుకోవడం లేదన్నారు. చర్చలు,రాజీలేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని ఆయన టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 50 వేల మంది కార్మికులు 40 రోజులుగా సమ్మె చేస్తున్నా, 25 మంది కార్మికులు చనిపోయారన్నారు. అయినా ప్రభుత్వం చలించడం లేదన్నారు. ఈ నెల 18వ తేదీకి కేసు వాయిదా పడిందని, ఈ సందర్భంగా ప్రభుత్వం చర్యలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు.
సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తా
సింగరేణి యాజమాన్యం బోర్డు సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ శ్రీ్ధర్ బాబు మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం సమీక్ష సమావేశానికి తనను పిలవలేదన్నారు. నిబంధనల మేరకు తనను ఆహ్వానించాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉందన్నారు. సింగరేణి ప్రాంత సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం ఎందుకు ఇవ్వలేదన్నారు. సింగరేణి ప్రాంత ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశానికి తనను ఆహ్వానించిన పక్షంలో ఈ ప్రాంత సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం దొరికి ఉండేదన్నారు. ఇది ముమ్మాటికీ సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఈ విషయమై స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.