తెలంగాణ

కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 13: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో రోజురోజుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల్లో ఛరిష్మా తగ్గిపోయిందని నేనే రాజును, నేనే చక్రవర్తిని అనే విధానాన్ని ఆయన అవలంబిస్తున్నారని ప్రజాస్వామ్య ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ధర్నాకు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారకులు అవుతున్నారని మహబూబాబాద్‌లో నరేష్ అనే కార్మికుడు ఆరు పేజీల నోట్ రాసి పురుగుల మందు తాగి తన ఆత్మహత్యకు కారణం కేసీఆర్ అంటూ పేర్కొన్నారని తక్షణమే, దానిని సుమోటోగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికార మదంతో తనను ఎవరూ ఏమీ చేయలేరని భావిస్తున్నారని అందుకే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడం లేదని అన్నారు. తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని కాబట్టి తానే రాజును, తానే చక్రవర్తినని భావిస్తూ ఆర్టీసీ జేఏసి వారితో చర్చలు జరిపితే తన ఆధిపత్యం తగ్గిపోతుందన్న అహంకారంతో చర్చలు జరపడంలేదని ధ్వజమెత్తారు. ఫ్రాన్స్ విప్లవం, రష్యా విప్లవం, చైనా విప్లవం ఎందుకొచ్చాయో కేసీఆర్ ఓసారి నెమరు వేసుకుంటే మంచిదని హితవుపలికారు. ఫ్రాన్స్‌రాజుకు పట్టినగతే కేసీఆర్‌కు పడుతుందని మల్లురవి హెచ్చరించారు. రాజు, చక్రవర్తుల కాలం కాదని ప్రజాస్వామ్యంలో ఉన్నామని గ్రహించుకుంటే మంచిదని హితవుపలికారు. ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకాకుంటే ఉద్యోగాలు ఊడుతాయని కేసీఆర్ బెదిరింపులకు దిగినాకార్మికులు మాత్రం సమస్యలపై సాధన కోసం 40 రోజులుగా సమ్మె చేస్తున్నారంటే రాష్ట్రంలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఆయన ఛరిష్మా తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలను ప్రజలు లెక్క చేయడంలేదనడానికి ఇదో నిదర్శనమని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని మిలియన్ మార్చ్ ద్వారా ట్యాంక్‌బండ్ ముట్టడిస్తే పోలీసులతో ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జి చేయంచారని, ఈ సంఘటనతో కేసీఆర్ విలువ మరింత దిగజారిపోయిందని విమర్శించారు. ట్యాంక్‌బండ్‌ను ముట్టడించడం అంటే కేసీఆర్‌పై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పడానికి ఇదో నిదర్శనమని అన్నారు. హైకోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మూసుకుని ఉండటం సిగ్గు చేటని వారంతా డమీలుగా మారిపోయారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఏ సమస్యకైనా చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకుని చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి సూచనలు కూడా లెక్కచేయడం లేదంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమైపోతుందని కోర్టు సూచనలు పట్టించుకోకుంటే కేసీఆర్ పదవి ఊడటం ఖాయంగా కనిపిస్తుందని హెచ్చరించారు.
ఈ ధర్నాలో టీపీసీసీ కార్యదర్శి ఎన్‌పి.వెంకటేష్, నాయకులు బెనహర్, అనితారెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, ఆర్టీసీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...ధర్నాలో మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి