తెలంగాణ

ఇది సీఎం చేసిన 21వ హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరిపెడ, నవంబర్ 13: ఆర్టీసీ కార్మికుల పట్ల కక్షపూరిత వైఖరిని అవలంబిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన 21వ హత్య మానుకోటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ నరేష్‌ది అని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన ఆర్టీసీ కార్మికుడు నరేష్ అంత్యక్రియల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నరేష్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన చిన్నగూడూరు మండలం ఎల్లంపేటకు తీసుకువచ్చారు. హైద్రాబాద్ నుండి అనేక అవాంతరాలు, అనుమతుల నడుమ ఎల్లంపేటకు చేరుకున్న అశ్వత్థామరెడ్డి నరేష్ మృతదేహం వద్ద నివాళి అర్పించాడు. అశ్వత్థామరెడ్డితో పాటు పీవోడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు సంధ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ఎల్‌హెచ్‌పిఎస్ జాతీయ నాయకులు బెల్లయ్యనాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, సీపీయం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌లతో పాటు అనేక మంది నాయకులు అంతిమ నివాళులు అర్పించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తన వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇవి ముఖ్యమంత్రి చేస్తున్న హత్యలని ఆరోపించారు. న్యాయస్థానాలను సైతం చేయకుండా, చట్టాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడన్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన తెలంగాణ ముఖ్యమంత్రి రానున్న కాలంలో మరింత తీవ్ర ప్రతిఘటనను ప్రజల నుండి ఎదుర్కొంటారని అన్నారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం మైండ్‌గేమ్ ఆడుతుందని, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులే అంతిమ విజయం సాధిస్తారని, నరేష్‌దే ఆఖరు ఆత్మహత్య కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి చెప్పే పరిస్థితుల్లో ఏ ఒక్క మంత్రి లేడని, మంత్రులు ఆర్టీసీ కార్మికులకు ధైర్యం చెప్పేందుకైనా కనీసం ప్రయత్నించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బేషజాలకు పోవద్దని ఆయన అన్నారు. తెలంగాణ రాష్టస్రమితి మినహా మిగతా అన్ని పార్టీలు, రాజకీయ పక్షాలు ఆర్టీసీ సమ్మెకు అనుకూలంగా తమ మద్దతును ప్రకటిస్తున్నాయని తెరాసలోని ద్వితీయ శ్రేణి క్యాడర్ సైతం పరోక్షంగా ఆర్టీసీ సమ్మెకు సహకరిస్తుందని అన్నారు. స్వతాహాగా నరేష్ తనకు సన్నిహితుడని, ధైర్యవంతుడని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులకు నెట్టివేయడం బాధ కల్గించిందన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటం విజయం సాధించడం ఖాయం అని, ఆత్మహత్యలు చేసుకోవడం ఉద్యమ నాయకులను సైతం ఇబ్బంది పెడుతుందని తెలిపారు. ఎల్లంపేటలో నరేష్ అంతిమయాత్ర నేపథ్యంలో అనేకమంది నాయకులు గ్రామానికి చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు చర్యలను చేపట్టింది.
*చిత్రాలు.. ..నరేష్ అంత్యక్రియల్లో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు
*జిల్లా ఎస్పీతో మాట్లాడుతున్న అశ్వత్థామరెడ్డి