తెలంగాణ

కరీంనగర్‌లో కేసీఆర్ ఇంటి ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కరీంనగర్ శివారులోని తీగులకుంటపల్లిలో ఉన్న కేసీఆర్ ఇంటిని ముట్టడించడానికి బుధవారం వామపక్షాలు యత్నించాయ. దీంతో ముందుగానే కేసీఆర్ ఇంటి వద్ద బ్యారికేడ్లు, ప్రహరీగోడలపై కంచెలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మిక సమ్మె 40 రోజులకు చేరినా సీఎం నుంచి స్పందన రాకపోవడంతో కరీంనగర్‌లోని కేసీఆర్ ఇల్లు అయన ఉత్తర తెలంగాణ భవన్‌ను ముట్టడించి ఆందోళన చేయడానికి బుధవారం వామపక్షాలు యత్నించగా, ముందస్తుగా కొందరిని అదుపులోకి తీసుకొని ఠాణాల్లో నిర్బంధించారు. సీఎం ఇంటివైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు విద్యార్థి నేతలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. కేసీఆర్ ఇంటిని ముట్టడించడానికి యత్నించిన వామపక్షాలను కట్టడి చేసేందుకు ఆందోళనకారులను ఎక్కడికక్కడే అరెస్టు చేసి వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తారన్న సమాచారంతో బుధవారం ఉదయానే్న ఇళ్లలోనుంచి పలువురు నేతలను నిర్బంధంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు మాట్లాడుతూ నిర్బంధాలతో ఆర్టీసీ ఉద్యమాలను ఆపడం ప్రభుత్వం తరం కాదన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు ఆందోళనలు ఎగసిపడుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి 40 రోజులు గడుస్తున్నా కేసీఆర్ సర్కార్‌కు చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనే కుట్రలో భాగమే ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తుందని, ఇందుకు పోలీస్ బలగాలను ఉపయోగించుకుంటుందన్నారు. అధికారంలో ఉన్నాం, ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో నిర్బంధకాండ కొనసాగిస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రశ్నిస్తే, ఉద్యమిస్తే ఉక్కుపాదాలతో అణచివేసే దోరణి అవలంబిస్తున్నారన్నారు. 40 రోజులుగా ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా కనీసం కార్మికులతో చర్చలు జరిపేలా సానుకూలంగా స్పందించేందుకు చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. నిర్బంధం మధ్య చర్చలను కొనసాగించేందుకు కార్మిక సంఘాల నేతల ఫోన్లను తీసుకొన్న తీరును తప్పుపట్టారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాకపోవడం అహంకారపూరిత దోరణితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించడం, ఇదంతా గవర్నర్ గమనిస్తున్నారని, సమయం వచ్చినపుడు సర్కార్ పతనం తప్పదని ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు శాపనార్థాలు పెట్టారు.
*చిత్రం...కేసీఆర్ ఇంటిని ముట్టడించకుండా కట్టడి చేస్తున్న పోలీసులు