తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టును ఏపీ వ్యతిరేకిస్తే మాట్లాడరెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరాదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే టీఆర్‌ఎస్ సర్కార్ ఎందుకు వౌనంగా ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ముందుంటానని పదే పదే చెబుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అనే విషయం కేసీఆర్‌కు తెలుసునని చెప్పారు. రూ.35వేల కోట్లు ఖర్చుపెడితే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. కానీ, కేసీఆర్ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని
ఒక లక్ష కోట్ల రూపాయలకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఇంత ఖర్చుపెట్టినా ఒక చుక్క నీరు కూడా పారడం లేదన్నారు. గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రాకు ఇస్తామని కేసీఆర్ గతంలో చేసిన ప్రకటన హాస్యాస్పదమని రుజువైందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంకు రూ.20వేల కోట్లు ఖర్చుపెట్టారన్నారు. ఏపీకి నీళ్లు ఇవ్వవద్దని గతంలో ఎన్నికల ముందు కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్నికల తర్వాత ఏపీ సీఎం జగన్‌తో గోదావరి నీళ్లను కృష్ణా నదికి తరలింపుపై చర్చలు జరిపారన్నారు. ఏపీకి నీళిస్తామంటే తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేయడమేనన్నారు. కాని ఈ రోజు ఏపీ ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పితే, కేసీఆర్ నోరు మెదపడం లేదని విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా రీ డిజైన్ చేస్తే జాతీయ హోదా ఎలా ఇస్తారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్‌నకు మాత్రమే సరిపోయారని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నియంతగా మారారని చెప్పారు. ప్రాజెక్టులపై బహిరంగ చర్చలకు రావాలని గతంలో చాలా సార్లు సవాలువిసరినా ప్రభుత్వం స్వీకరించలేదన్నారు.

*చిత్రం... పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య